ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి కన్నులు మూసుకుంటే చాలు ఆయన కలల్లోకి మహేష్ బాబు వచ్చి హల్ చల్ చేస్థున్నాడట. మహేష్ బాబు తో కలిసి టాలీవుడ్ లో రాజమౌళి సంచలనాలు సృష్టిస్థున్నాడట. అంతటి ప్రముఖ డైరెక్టర్ కు సుఖనిద్ర లేకుండా చేస్థున్న మహేష్ బాబు కథేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా...

ఇప్పుడు టాలీవుడ్ లో ప్రముఖ డైరెక్టర్ లలో ఒకరు రాజమౌళి అయితే, ప్రముఖ హీరోలలో ఒకరు మహేష్ బాబు అన్నది అందరికి తెలిసిందే. రాజమౌళితో సినిమా తీయాలి అనే హీరోలు, మహేష్ బాబుతో సినిమా తీయాలి అనే డైరెక్టర్లు ఉన్నారనడంలో కూడా సందేహం లేదు.

ఇప్పుడు రాజమౌళి మహేష్ బాబు తో కలిసి టాలీవుడ్ లో పెద్ద సంచలనం క్రియేట్ చేయాలని కలలు కంటున్నాడట. మహేష్ బాబుతో ఒకటి కాదు రెండు సినిమాలు తీసి బిగ్ హిట్లు కొట్టాలనుకుంటున్నాడు. అవి కూడా కొత్తవి కాదు, మహేష్ తండ్రి తీసిన ‘గూడాచారి 116’ , ‘ అల్లూరి సీతారామరాజు’ సినిమాలు. ప్రిన్స్ ఓకే అనడమే తరువాయి రాజమౌళి రెడీ, కాని ఇప్పుడయిదే ఈ ఇద్దరు బిజీ, కాబట్టి ఇది ఎప్పుడు నిజమవుతుందో చూడాలి మరి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: