రామ్‌చ‌ర‌ణ్ జంజీర్ మూవీ హిట్ అయితే అక్కడ ఏంజ‌ర‌గ‌బోతుంది..? హిట్ కాక‌పోతే ఏం జ‌రుగుతుంది..? మీడియా రామ్‌చ‌ర‌ణ్ గురించి ఏం చేస్తుంది..?  ఇదంతా సామాన్య  సినిప్రేక్షకుడికి తెలియ‌క‌పోవ‌చ్చు. కాని రామ్‌చ‌ర‌ణ్ వాటికి సంబంధించిన ప్లానింగ్స్‌ను ముందుగానే రెడీ చేసుకున్నాడు. జంజీర్ ఎప్పుడు, ఎలాంటి ప‌రిస్థితుల్లో రిలీజ్ అయినా హిట్ ప‌క్కా. ఇది కాన్ఫిడెంట్‌తో చ‌ర‌ణ్ చెబుతున్న బుల్లెట్ మాటలు. రామ్‌చ‌ర‌ణ్ జంజీర్ మూవీ కోసం నేష‌న‌ల్ మీడియా వెయ్యి క‌ళ్ళతో ఎదురుచూస్తుంది. ఓ రకంగా చెప్పాలంటే బాలీవుడ్ డెబ్యూ ఫిల్మ్‌ను రామ్‌చ‌ర‌ణ్ కంటే చిరంజీవే ఎక్కువు భాద్యత‌ను తీసుకున్నాడు.

బి-టౌన్‌లో వినిపిస్తున్న టాక్ ప్రకారం నేష‌న‌ల్ టాప్ ఎంట‌ర్‌టైన్ మీడియ అండ్ న్యూస్ మీడియాను చిరు కొనేశాడ‌ని, జంజీర్ ప్రమోష‌న్ నిముత్తం, రామ్‌చ‌ర‌ణ్ కెరీర్ కోసం టాప్ మీడియాల‌తో లాభీయింగ్ చేసినట్టు అక్కడ వినిపిస్తున్న మాట‌. నేష‌న‌ల్ ఫేమ‌స్ మీడియా టైమ్స్‌నౌ ఇప్పటికే రామ్‌చ‌ర‌ణ్ మీద ఓ స్పెష‌ల్ ప్రొగ్రామ్‌ను షూట్ చేసింది. ఆ ప్రాగ్రామ్ ఎప్పుడో టెలికాస్ట్ కావ‌ల్సి ఉండ‌గా, జంజీర్ రిలీజ్ నాటికి పార్ట్1,పార్ట్‌2 అంటూ రిలీజ్ చేయాల‌ని చ‌ర‌ణ్ ఆ మీడియాను స‌జెస్ట్ చేసిన‌ట్టు తెలుస్తుంది. జంజీర్ రిలీజ్ ముందు, త‌రువాత నేష‌న‌ల్ మీడియాలో రామ్‌చ‌ర‌ణ్‌ను హైప్ క్రియోట్ చేయ‌టానికి అక్కడ మీడియా సిధ్ధమైంది. దానికి తగ్గ ఏర్పాట్లకు టాలీవుడ్ నుండి మెగా ప్లానింగ్ జ‌రిగింద‌ని స‌మాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: