ఆ హీరోయిన్ ఐటెం సాంగ్ చేయాలంలే దాని ఖ‌రీదు అక్షరాలు 6 కోట్ల రూపాయ‌లు. ఇంత‌టి డిమాండ్ ఉన్న ఐటెం నెంబ‌ర్ ఎవ‌రో కాదు. బ‌బ్లీ బ్యూటీ సోనాక్షిసిన్హా. సోనాక్షిసిన్హా చేయ‌బోయో ఐటెం సాంగ్ కోసం 6 కోట్ల రూపాయ‌ల‌ను అడిగింది. అడిగినంత ఎమౌంట్‌ను ఇవ్వటానికి వాళ్ళు సిద్దమ‌య్యారు. దీనికి సంబంధించిన షూటింగ్ సెప్టంబ‌ర్ రెండో వారంలో ఉంటుంది. అక్షయ్‌కుమార్ అప్ క‌మింగ్ మూవీ బాస్ కోసం సోనాక్షితో ఐటెం సాంగ్‌ను రెడీ చేశారు. ఇప్పుటికే అక్కి,సోనాక్షి ఇద్దరూ క‌లిసి మూడు మూవీల్లో న‌టించారు. రౌడీరాథోర్‌,జోక‌ర్‌,ఒన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబాయ్ ఎగైన్ ఇలా వరుస మూవీల తరువాత బాస్ మూవీలో ఐటెం సాంగ్ చేస్తుంది.

అక్కి స‌ర‌స‌న ఐటెం కోసం 6 కోట్లను డిమాండ్ చేయ‌డంతో బాలీవుడ్ షాక్ అయింది. ఇంత అమౌంట్ ఇస్తార అని సందేహిస్తుండ‌గానే, సోనాక్షికు ఓకె అన్నారు ఆ నిర్మాత‌లు. దీంతో మంచి మాస్ మ‌సాల సాంగ్ రెడీ అవుతుంది. అక్షయ్‌కుమార్ బాస్ మూవీ 2010లో మ‌మ్ముట్టి,శ్రేయ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన యాక్షన్,మ‌సాల ఎంట‌ర్‌టైన‌ర్ పోకిరిరాజ మూవీకు ఇది రిమేక్‌గా తెర‌కెక్కుతుంది. బాస్ మూవీను అక్టోబ‌ర్‌లో రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ రిలీజ్ డేట్ కొద్దిగా మార్పులు ఉండ‌వ‌చ్చని బిటౌన్ న్యూస్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: