రాంచ‌ర‌ణ్ జంజీర్ మూవీ యూట్యూబ్‌లో రిలీజ్ కాబోతుందా అనే డౌట్ బాలీవుడ్‌లో ఊపందుకుంది. ఎందుకంటే జంజీర్ ఆడియోను ఎటువంటి హంగామా లేకుండానే యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. ఈ మూవీను రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైనర్ తెర‌కెక్కిస్తుండగా, రిల‌య‌న్స్‌కు మార్కెటింగ్ స్ట్రాటెజీ తెలుసు కాబ‌ట్టి జంజీర్‌ను ముందుగా యూట్యూబ్‌లో రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయ‌ని బిటౌన్ హాట్ గాసిప్‌. జంజీర్ మూవీ పై ఇంకా కోర్టు కేసు తేల‌క‌పోవ‌డంతో, ఈ మూవీ పై ర‌క‌ర‌కాల న్యూస్‌లు చ‌క్కెర్లు కొడుతున్నాయి. జంజీర్‌ థియోట‌ర్లో రిలీజ్ చేసుకోలేక‌పోతే, యూట్యూబ్‌లోనే రిలీజ్ చేసుకోవాలంటూ రామ్‌చ‌ర‌ణ్‌పై నెగిటివ్ ప‌బ్లిసిటి జ‌రుగుతంది.

టాలీవుడ్ హీరో ఇబ్బందుల్లో ప‌డ్డాడంటూ ముఖ్యంగా కొన్ని నిర్మాణ‌సంస్థలు ఈ త‌ర‌హా న్యూస్‌ను స్ప్రెడ్ చేస్తున్నాయి. ఇందులో నిజం ఎంత‌ ఉందో తెలియ‌క‌, రామ్‌చ‌ర‌ణ్ మూవీ ఇంతేనేమో అని నార్త్ ఇండియ‌న్ సినీ ప్రేక్షకులు అనుకుంటున్నారంట‌. అయితే ఈ గాసిప్‌పై స్పందించిన ఆపూర్వలిఖియా ఇదంతా అబ‌ద్ధమంటూ చెప్పాడు. రామ్‌చ‌ర‌ణ్‌,ప్రియాంక చోప్ర న‌టించిన జంజీర్ త్వర‌లోనే థియోట‌ర్స్‌లో రిలీజ్ అవుతుంద‌ని. ఈ మూవీపై వ‌స్తున్న దుష్పచారాల‌ను నమ్మవ‌ద్దు అంటూ మూవీను ఉద్దేశించి మాట్లాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: