బాలక్రిష్ణ చిన్న కూతురు పెళ్లి రాష్ట్రంలోని రాజకీయాల్లోను, సినిమావాళ్లలోని పెద్ద దుమారాన్నే లేపింది. ఈ పెళ్లికి హరిక్రిష్ణ రాకపోవడం రాజీకీయాల్లో, జూనియర్, అక్కినేని నాగార్జున రాకపోవడం సినిమావాళ్లో సంచలనం సృష్టించింది. దీంతో నాగార్జునకు బాలక్రిష్ణపై కోపం ఉందన్న వార్థలు టాలీవుడ్ లో గుప్పుమన్నాయి.

నిజానికి బ్యాడ్మింటన్ లీగ్ పోటీల సంధర్భంగా  నాగార్జున తన ఫ్యామిలీతో  ముంబయిలో ఉన్నందున రాలేక పోయారని అంటున్నారు, ఆయన తండ్రి నాగేశ్వర్ రావు మాత్రం పెళ్లికి హాజరయ్యారు. కాని తన సహచరనటుడు, మంచి మితృడు అయిన బాలక్రిష్ణ కూతురు పెళ్లికి ఇది అడ్డంకి కాకపోవచ్చన్న గుసగుసలు మాత్రం సినిమావర్గాల్లో వినిపిస్థున్నాయి.

కొన్ని రోజుల క్రితం ఒక పనిపై నాగార్జున  అవసరం పడి బాలక్రిష్ణ సహాయాన్ని కోరాడట. అంతే కాదు పలుసార్లు ఈ సహాయం కోసం నాగార్జున స్వయంగా బాలయ్య వద్దకు వెల్లినా తిప్పించుకున్నాడే తప్ప ఆ సహాయం చేయలేదని చెప్పుకుంటున్నారు టాలీవుడ్ లో. దీంతో నాగార్జునకు బాలక్రిష్ణపై కోపం వచ్చిందని, ఇక నుంచి బాలక్రిష్ణకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడని చెప్పుకుంటున్నారు సినిమా వాళ్లు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: