మంచు మ‌నోజ్ న‌టిస్తున్న అప్‌క‌మింగ్ మూవీ పోటుగాడు. అయితే ఈ పోటుగాడి ప‌ని అయిపోయిందంటున్నారు. దీని అర్ధం మంచు మ‌నోజ్ ప‌ని అయిపోయిందని కాదు. పోటుగాడు మూవీకు సంబంధించిన షూటింగ్ వ‌ర్క్ అంతా పూర్తయింద‌ని. రామోజీ ఫిల్మ్ సిటీలో చివ‌ర‌గా షూట్ చేసిన ఒకే ఒక‌ పాటతో ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. దాంతో ఈ సినిమాకి గుమ్మడికాయ కొట్టేసారు. ఈ మూవీ ఆడియోను ఆగ‌ష్టు 25న రిలీజ్ చేయటానికి స‌న్నాహాలు చేస్తున్నారు. అంతేకాకుండా రిలీజ్‌ను కూడ ఎక్కువ ఆల‌స్యం చేయ‌కుండా త్వర‌గానే రిలీజ్ చేయాల‌ని ప్రొడ్యూజ‌ర్స్ భావిస్తున్నారు. పోటుగాడి మూవీకు చ‌క్రి సంగీత బాణీల‌ను అందించాడు.

కన్నడ సినిమా ‘గోవిందాయ నమః’ కి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాను తెలుగు నేటివిటికి అనుగుణంగా తెర‌కెక్కించారు. ఒరిజిన‌ల్ క‌న్నడ మూవీకు, ఇక్కడి తెలుగు రిమేక్‌కి డైరెక్టర్లు ఒక్కరే కావ‌డం విశేషం. ఎట్‌ప్రెజెంట్ మంచు మ‌నోజ్ సైతం హిట్ కోసం తెగ వెయిట్ చేస్తున్నాడు. షూటింగ్ పూర్తవ‌డంతో ఓ ప‌క్క పోస్ట్ ప్రొడ‌క్షన్‌కి సంబింధించిన ప‌నులు కూడ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. సెప్టంబ‌ర్ 6న తుఫాన్ మూవీ పోస్ట్‌పోన్ అయితే, అదే రోజున పోడుగాడి మూవీను రిలీజ్ చేయాల‌నే అలోచ‌న‌ను కూడ చేస్తున్నారు ఈ పోటుగాడు యూనిట్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: