మిల్కీ బ్యూటీ తమన్నాకి  టాలీవుడ్ లో  ఆఫర్స్ లేకపోయినా   కోలీవుడ్ లో  వెలిగిపోతోంది.  అంతే కాదు ఏకంగా ఈ తెల్ల తోలు పిల్ల  రెండు కోట్లు దాకా డిమాండ్ చేస్తోంది తమన్న. హీరో కార్తీ నటించిన ‘సిరుతై' తరువాత తమన్నాకు  తమిళం లో చెప్పుకో దగ్గ అవకాశాలు లేవు .   ఈ నేపధ్యంలో ప్రస్తుతం అజిత్ హీరో గా నటిస్తున్న ‘వీరమ్' చిత్రంలో నటిస్తోంది తమన్నా. తెలుగు సినిమాలకు కోటి ఇరవై లక్షలు తీసుకుంటున్న ఈ భామ అజిత్ సినిమా కోసం ఏకంగా రెండు కోట్లు పారితోషికం తీసుకుంటోందని చెన్నై చిత్ర వర్గాలు అంటున్నాయి.

ప్రస్తుతం తమిళ నాట అజిత్ కు  చెప్పుకో దగ్గ హిట్స్ లేకపోవడంతో  తమన్నా ఏకం గా ఈ రేంజ్ లో డిమాండ్ చేసిందని టాక్. తెలుగులో నాగచైతన్య తో చేసిన ‘తడాఖా' తరువాత  ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ లో స్పీడ్ పెంచింది. మహేష్ హీరోగా శ్రీనువైట్ల రూపొందించనున్న ‘ఆగడు' చిత్రంతో తమన్నా టాలీవుడ్ లో ప్రిన్సు తో జత కడుతుందని వార్తలు వచ్చినా లేటెస్ట్ గా ఈ సినిమాలో మహేష్ సరసన శ్రుతి పేరు వినిపిస్తోంది. అజిత్  అంటే తనకు ఇష్టం అని  అందుకే ఈ సినిమాను ఒప్పుకున్నాను అని కలరింగ్ ఇస్తున్న తమన్నాకు అజిత్ కన్నా ఒకే సారి వచ్చి పడుతున్న రెండు కోట్లు మంచి కిక్ ఇచ్చి నట్లు గా కనిపిస్తోంది. అందుకే కాబోలు ముందు సంపాదన ఆ తర్వాతే ప్రేమ పెళ్లి అంటోంది మన మిల్కీ బ్యూటీ..

మరింత సమాచారం తెలుసుకోండి: