ఆక్కాచెల్లలి మ‌ధ్యన తొలిసారిగా బిగ్‌ఫైట్ జ‌రుగుతుంది. బాక్సాపీస్ వ‌ద్ద  వారి సినిమాల‌తో ఈ అక్కాచెల్లల్లు పోటీకుదిగారు. వ‌చ్చేనెల సెప్టంబ‌ర్ 6న ప్రియాంక‌చోప్ర,రామ్‌చ‌ర‌ణ్ మూవీ జంజీర్ రిలీజ్ అవుతుంది. అదే రోజున ప్రియాంక క‌జిన్ ప‌రిణితి చోప్ర న‌టించిన షుద్ దేశి రోమాన్స్ మూవీ రిలీజ్ అవుతుంది. ప్రియాంక చోప్ర,రామ్‌చ‌ర‌ణ్ జంజీర్‌ మూవీపై పెద్దగా హైప్ లేక‌పోయిన‌ప్పటికి ఈ అక్కాచెల్లల్లు ఒకే రోజున రిలీజ్‌లు పెట్టుకోడంతో ఈ రెండు మూవీల మ‌ధ్య ఫైట్ జ‌ర‌గ‌బోతుంది. అక్క మూవీపైనే పోటికి వ‌స్తున్నందకు త‌న మూవీకే హైప్ క్రియోట్ అవ్వటం ఖాయం అని ప‌రిణితిచోప్ర లెక్కలేసుకుంటుంది.

ఇదే విష‌యాన్ని పరిణితిచోప్రను అడిగితే 'మా ఇద్దరి మ‌ధ్య ఫైట్ అనేది కామ‌న్‌. రియ‌ల్‌లైఫ్ లోనూ నేను అక్కను అంత‌గా ప‌ట్టించుకోను. ఇక్కడ కూడ అంతే. లైట్ తీసుకోండి. అయినా జంజీర్ మూవీలో ప్రియాంక‌చోప్ర త‌ప్పితే లీడింగ్ రోల్ చేసే హీరోకు బాలీవుడ్ కొత్తే క‌దా. నా మూవీ పై అంత‌గా ఎఫెక్ట్ ఉండ‌క‌పోవ‌చ్చు' అని స్టేట్‌మెంట్ ఇచ్చింది. ప‌రిణితి చోప్ర ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో చోప్ర సిస్టర్స్ వీకెండ్ వార్ అని బిటౌన్‌లో హాట్‌టాపిక్ న‌డుస్తుంది. చెల్లి చేస్తున్న చేష్టల‌పై ప్రియాంక చోప్ర ఇక‌నైన సీరియ‌స్ యాక్షన్‌ తీసుకోక‌పోతే, వీరిద్ధరి మ‌ధ్య అంతులేని అగాధం ఏర్పడ‌ట‌మే కాకుండా త‌రువాతి రోజుల్లో చిల్లరిగా ప‌బ్లిక్‌లోనే కొట్టుకోవ‌డం ఖాయం అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: