కలర్స్ స్వాతి అసలు రంగు బయటపడింది, ఆమె హీరోయిన్ గా ఎందుకు ఎదగలేకపోతోందో ఇప్పుడర్థమవుతోంది అంటున్నారు ఆమె గూర్చి తెలిసిన వారంతా. టివి చానల్ లో కలర్స్ ప్రోగ్రాంతో పాపులర్ అయినంత మాత్రానా అదేదో పెద్ద పొడిచినట్టు ఫోజులు కొడితే ఎలా... సినిమాలు టివిషోలు కావమ్మా... అంటున్నారు.

‘ఆడవారి మాటలకు అర్థాలు వేరులే’ ‘అష్టా చమ్మా’ ‘స్వామి రారా’ సినిమాలతో తెలుగు సినిమాల్లో రానించలేక ఇక్కడ అవకాశాలు లేక స్వాతి తమిళ, మలయాళం సినిమాలపై పడింది. అక్కడైనా పొందికగా ఉంటే హీరోయిన్ గా ఎదుగుతుంది, కాని ఏంచేస్థోంది.

ఓ కొత్త డైరెక్టర్ ప్రిన్స్ తో నటించేందుకు స్వాతివద్దకు వచ్చాడట. పూర్తి స్క్రిప్ట్ డైలాగులతో సహా ముందే ఇవ్వాలని డిమాండ్ చేసిందట. పెద్ద పెద్ద హీరోయిన్లే ఇలా డిమాండ్ చేయరు. అలాంటిది స్వాతి డిమాండ్ చేసేసరికి ఆడైరెక్టర్ కంగుతిన్నాడని సమాచారం. ఇలాగైతే ఎలా ఎదుగుతుంది చెప్పండి, ఇదండీ ఆమెకు నటన, అందం అన్నీ ఉన్నా ఆమె అసలు రంగు ఇలా ఉంటే ఏంచేస్థాం చెప్పండి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: