యూత్ కు ఆనందాన్ని పెంచే మన గ్లామర్ బ్యూటీలు నిరుద్యోగాన్ని పెంచడం ఏమిటి అని అనుకుంటున్నారా..? అసలు విషయం ఏమిటి అంటే, టాలీవుడ్, బాలీవుడ్ రంగాలలో మహారాణులులా ఒక వెలుగు వెలిగి ఇప్పుడు అవకాశాలు తెగిపొయిన చాలామంది క్రేజీ బ్యూటీలు ఐటమ్ గర్ల్స్ గా మారిపోవడం తో ఐటమ్ సాంగ్స్ చేసే చాలామంది భామలకు అవకాశాలు లేక నిరుద్యోగులు గా మారిపోతున్నారు. దీనికి ప్రత్యక్ష ఉదారహరణ ఐటమ్ గర్ల్ ముమైత్ ఖాన్ కెరియర్.

శ్రియ, పార్వతి మెల్టన్, ప్రియమణి, ఛార్మి ల లాంటి హీరోయిన్స్ తో పాటు బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ కత్రినా కైఫ్, మాధురి ధీక్షిత్, సోనాక్షి సిన్హా లు కూడా స్పెషల్ సాంగ్స్ అంటూ కోట్లాది రూపాయల పారితోషికానికి ఐటమ్ గర్ల్స్ గా మారిపోతూ అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ లలో ఐటమ్ గర్ల్స్ నిరుద్యోగాన్ని పెంచేస్తున్నారు అంటూ వార్తలు వినపడుతున్నాయి. యాక్టింగ్ స్కిల్ల్స్ ఉన్నా లేకపోయినా స్కిన్ షో చేయగల సామర్ధ్య౦ ఉంటే చాలు కోట్లాది రూపాయల పారితోషికాలు మన బ్యూటీల కాళ్ళ దగ్గరకు వచ్చి పడుతూ ఉండడంతో మన టాప్ హీరోయిన్స్ అంతా ఐటమ్ గర్ల్స్ గా మారిపోతే హీరోయిన్స్ కొరత రాకుండా ఎక్కడ ఉంటుంది. అందుకే మన నిర్మాతలు హీరోయిన్లు కోసం అలా దేశవిదేశాలు తిరుగుతూ వేటాడుతూనే ఉంటారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: