యోగా బ్యూటీ అనుష్క 31 సంవత్సరాలు వచ్చినా చెక్కిన శిల్పంలా చూసే వారికి కనువిందుగా ఉంటుంది. అది ఆమె స్పెషాలిటీ. అనుష్క పని అయిపోయింది అని వార్తలు వస్తున్న నేపధ్యంలో తన సత్తా ఏమిటో చూపెడుతూ ఒకేసారి రెండు భారీ బడ్జెట్ సినిమాలలో నటిస్తూ తన రేంజ్ చూపెడుతోంది. మరొక ముఖ్య విషయం ఏమిటంటే, ఈ రెండు సినిమాలు చారిత్రిక నేపధ్యం కల సినిమాలు కావడం ఈ రెండు సినిమాలలోనూ రాజకుమారి పాత్రను పోషించడం అనుష్క కెరియర్ లో టర్నింగ్ పాయింట్ గా చెప్పుకోవాలి.

ప్రస్తుతం అనుష్క గుణశేఖర్ దర్శకత్వంలో ‘రాణి రుద్రమ’, రాజమౌళి దర్శకత్వం లో ‘బాహుబలి’ సినిమాలలో నటిస్తోంది అన్న విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాల షూటింగ్ లు ఒకదాని వెంట ఒకటి జరుగుతూ అనుష్క ను ఖంగారు పెడుతున్నాయి. మహారాణి రాణి రుద్రమ పాత్రలో అనుష్క నటిస్తున్న సినిమా విషయానికి వస్తే, ఆ సినిమాకు సంబంధించి చాలా రాజసంగా కనిపించాలి, అంతేకాకుండా సామంత రాజులను అణిచిపెట్ట గల మహారాణి పాత్రలో కర్కశంగా కనిపిస్తూ ఆ విధంగా తన శరీర ఆకృతిని మలచుకోవాలి. రాజమౌళి బాహుబలి సినిమాకు సంబంధించి రాజకుమారి పాత్ర కాబట్టి సన్నగా, నాజుకుగా కనిపించాలి. ఒక అందాల రాజకుమారి గా వెండితెరపై మెరవాలి. ఈ రెండు పాత్రలు ఎంత విభిన్నమైనవో అలాగే ఈ రెండు పాత్రకు సంబంధించిన శరీర ఆకృతి కూడా చాలా భిన్నంగా ఉండాలి. ఇలా ఈ రెండు సినిమాలలో కనిపించడం కోసం మన యోగా బ్యూటీ తన బరువు ను 12 కిలోలు తగ్గించుకోవడమే కాక ఒక స్పెషల్ ఫిజికల్ ట్రైనర్ ను పెట్టుకొని వ్యాయామం చేయడమే కాకుండా ప్రత్యేకమైన ఆహారాన్ని ఒక ప్రముఖ డైటీషన్ ఆధ్వర్యంలో ప్రతిరోజు తీసుకుంటో౦దట.

ప్రస్తుతం రాజమౌళి బాహుబలి షెడ్యుల్ లలో పాల్గొంటున్న అనుష్క పర్సనాలిటీని చూసిన రాజమౌళి తన శరీర ఆకృతిలో ఇంకా నాజుకుతనం రావాలని, రాజకుమారి పాత్ర కాబట్టి ఎంత నాజుకుగా కనిపిస్తే అంత బాగుంటుందని చెపుతూ ఉంటే ఈ షెడ్యుల్ పూర్తి కాగానే ప్రారంభం కానున్న రాణి రుద్రమ షెడ్యుల్ లో రాజసం ఉట్టిపడేలా కొద్దిగా మోటుగా కనిపించాలని అంటూ గుణశేఖర్ అడుగుతున్నాడట. ఈ రెండు సినిమాల షూటింగ్ లు ఒకేసారి జరగడం తో అటు రాజమౌళి ని ఇటు గుణశేఖర్ ను తన ఫిజిక్ విషయంలో సంతృప్తి పరచడానికి మన యోగా బ్యూటీ తెగ కష్టాలు పడుతోందని టాక్. ఇంతకీ మన స్వీటీ పడుతున్న కష్టాలను ఈ దర్శకులు ఇద్దరు ఎన్ని మార్కులు వేస్తారో చూడాలి.
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: