క్యూట్ బ్యూటీ సమంత మొన్న భాగ్యనగరంలో జరిగిన టాలీవుడ్ ఛానల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అందరూ విస్తూ పోయేలా ఒక వెరైటీ లుక్ లో వచ్చి అందరినీ ఆశ్చర్య పరచింది. సమంత తో పాటు ఈ కార్యక్రమానికి వచ్చిన కాజల్, తమన్నా, శ్రియ లు మోడ్రెన్ లుక్ తో వచ్చి అందరినీ అధరగోడితే సమంత మాత్రం దక్షిణాది సంప్రదాయంలో ఒక పేరంటానికి వచ్చే నిండు ముత్తైదువులా నిండుగా పట్టు చీర కట్టుకొని, జడ ముడి వేసుకొని ఆ ముడి నుండా నిండైన పూలు అలంకరించుకొని అప్పటికే పెళ్లి అయిపోయిన గృహిణిలా రావడం అందరినీ ఆశ్చర్య పరచింది.

సమంత కంటే వయసు లో ఎంతో పెద్దది అయిన శ్రీదేవి ఇదే ఫంక్షన్ కు మోడ్రన్ లుక్ తో వస్తే, సమంత మాత్రం డిఫరెంట్ గా రావడం చూస్తే త్వరలో తనకు సిద్ధూ తో జరగబోయే పెళ్లి తరువాత ఎటువంటి గెటప్ లో ఉండాలో ఆ గెటప్ ను ఉహించుకుంటూ ఇప్పటినుంచే ఆ గృహిణి అవతారాన్ని సాధన చేస్తున్నట్లుగా అనిపిస్తుంది ఈ గెటప్ చూసిన వారికి. ఈమధ్యనే భాగ్యనగరంలో హీరో సిద్ధార్ద్ చుట్టాల పెళ్ళిలో ఇటువంటి గెటప్ లోనే సమంత హడావుడి చేసింది అని వార్తలు వచ్చిన నేపధ్యంలో సిద్ధూ తో పెళ్లి కి సమంత మానసికంగా సిద్ధం అవుతున్నట్లు ఈ గెటప్ చూసిన వారికి అనిపిస్తోంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: