రాం గోపాల్ వ‌ర్మ రంగీలా మూవీ బాలీవుడ్‌లో ఎంత‌టి స‌న్షేష‌న్‌ను క్రియోట్ చేసిందో అంద‌రికి తెలుసు. ఊర్మిలాను ఓ ఎత్తుకు లేపిన మూవీ అది. అంతే కాకుండా వ‌ర్మను టాప్ పొజిష‌న్‌లో నిల‌బెట్టిన మూవీల‌లో రంగీలా కూడ ఒక‌టి. బాలీవుడ్ హీరోయిన్లు అయితే ఏకంగా వ‌ర్మ మూవీలో ఒక్కసారి న‌టిస్తే చాలు అంటూ వ‌ర్మ ఫోన్ కాల్ కోసం సంవ‌త్సరాలు త‌ర‌బ‌డి వేయిట్ చేసి వారు ఇప్పటికీ ఉన్నారు. అంత‌టి బ్లాక్‌బ‌స్టర్ మూవీ రంగీలాలో ఇప్పుడు వీనామాలిక్ న‌టిస్తుంది. ఏంటి నిజ‌మేనా అని అనుకుంటున్నారు. ఇది నిజంగానే నిజం.

రంగీలా అనే మూవీలో వీనామాలిక్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. అయితే వీనామాలిక్ రంగీలా మూవీకు, వ‌ర్మ రంగీలా మూవీకు ఎటువంటి సంబంధం లేదు. వీనామాలిక్ రీసెంట్‌గా న‌టించిన జింద‌గీ 50-50 మూవీను తెలుగులో డ‌బ్ చేస్తున్నారు. ఈ మూవీకు రంగీలా అనే తెలుగు టైటిల్‌ను పెట్టారు. అలాగే దీనికి సంబంధించిన తెలుగు డ‌బ్బింగ్ పూర్యయింది. అలాగే ఆ మూవీకు సంబంధించిన సెన్సార్ కూడ పూర్తయి త్వర‌లోనే రిలీజ్‌కు సిద్ధమ‌వుతుతుంది.ఈ మూవీ ప్రొడ్యూజ‌ర్ మాట్లాడుతూ వీనామాలిక్‌కి రంగీలా టైటిల్ క‌రెక్ట్‌గా స‌రిపోతుంది. తెలుగు ప్రేక్షకుల‌కి మ‌రింత చేరువ‌కాటానికే ఈ పేరును పెట్టాము. త్వర‌లోనే రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తాము అని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: