మెగా ప్రొడ్యూసర్ అల్లుఅరవింద్ ఒక ప్రముఖ దర్శకుడికి వార్నింగ్ ఇచ్చాడు అనే వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ప్రముఖ  నిర్మాత అయిన అల్లు అరవింద్ ఎప్పుడూ సైలెంట్ గా తన పని తను చేసుకుంటారు. ఇతరులకు ఎలాంటి ఇబ్బంది ఇవ్వడు అనే టాక్ ఉంది. అయితే ఇటీవల వరుస హిట్స్ తో దూసుకు పోతున్న ఒక ప్రముఖ టాలీవుడ్ బూతు దర్శకుడికి వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. అతడు ఎవరు అన్నది అందరికీ తెలుసు అతడే దర్శకుడు మారుతి. అసలు అరవింద్ మారుతీ పై ఫైర్ అవడానికి కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. అరవింద్ కుమారుడు అల్లుశిరీష్ తో ప్రస్తుతం మారుతి ‘కొత్త జంట’ అనే సినిమాను తీస్తున్నాడన్న విషయం తెలిసిందే.

ఈ సినిమా ప్రారంభం అయ్యేముందు కధను మారుతి అరవింద్ కు ఒకలా చెప్పి మరోలా తీస్తున్నాడట. తనకు అలవాటైన బూతు పురాణం సినిమాగా ఈ సినిమాను కూడా చుట్టేస్తున్నాడట. ఈ మధ్యనే ఈ సినిమా సన్నివేశాలను చూసిన అరవింద్ షాక్ అయి సెట్ లోనే మారుతిపై చిందులు వేశాడని వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఇప్పటివరకు తీసిన సన్నివేశాలను రీషూట్ చేయమని అలాగే కధను కూడ మార్చమని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడని అంటున్నారు. కానీ మారుతి మాత్రం ఇవేమి పట్టించుకోకుండా తన పద్దతిలోనే ఈ ‘కొత్త జంట’ను తీస్తూ ఉండటంతో ఇప్పటికే ‘గౌరవం’ సినిమా వల్ల గౌరవాన్ని పోగొట్టుకున్న శిరీష్ కెరియర్ కు మారుతి గ్రహణంలా మారతాడ అంటూ టెన్షన్ పడిపోతున్నాదట అల్లు అరవింద్....  

మరింత సమాచారం తెలుసుకోండి: