స‌మంత చ‌క చ‌కా సినిమాలు చేసుకంటూ వెళ్ళిపోతుంటే హారోలంతా ఖాళీ అవుతున్నారు. ఇప్పుడు మ‌ళ్ళీ ఆ హీర‌ల‌తో చేయాలంటే చాలా క‌ష్టమే అంటున్నారు. ఇందుకు స‌మంత చ‌క్కని సూత్రాన్ని క‌నుక్కొంది. టాలీవుడ్‌లో వ‌య‌సు పైబ‌డిన హీరోలు ఎంత మంది ఉన్నారో, వ‌య‌స్సులో ఉన్న స్టార్‌డం హీరోలు కూడ అంతే మంది ఉన్నారు. అందుకే త‌న ప్లాన్‌ను ఈ కుర్రహీరోల‌పై గురిపెట్టింది. అందులోని బాగంగానే నితిన్‌తో జోడి క‌ట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది. స్టార్‌డం ఉన్న యంగ్ హీరోల స‌ర‌స‌న న‌టించ‌టానికి నో అబ్జెక్షన్ అంటూ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన స‌మంతాను వెంట‌నే క్యాచ్ చేయ‌టానికి నితిన్ రెడీ అయిపోయాడు.

య‌జ్ఞం డైరెక్టర్ ఎ.య‌స్‌.ర‌వికుమార్ చౌద‌రి తో ఓ మూవీను చేయ‌టానికి నితిన్ రెడీ అయ్యాడు. ఈ మూవీలో స‌మంతా హీరోయిన్‌గా కావాల‌ని నితిన్ కోరుకుంటున్నాడు. దీనికి సంబంధించిన చ‌ర్ఛలు కూడ వేగంవంతంగా జ‌రుగుతున్నాయి. యంగ్‌స్టర్స్‌తో మూవీలు చేయ‌టానికి స‌మంతాకి ఎటువంటి స‌మ‌స్యలేదు కాబ‌ట్టి నితిన్‌తో స‌మంత న‌టించే అవ‌కాశాలే ఎక్కువుగా క‌నిపిస్తున్నాయంటున్నారు. ఏదేమైనా సమంత త‌న‌ని త‌ను ఏవింధంగా మార్కెట్ చేసుకోవాలో ఇట్టే క‌నిపెట్టేసింది. సమంత క‌నిపెట్టిన ఈ యంగ్ హీరోస్ కాంబినేష‌న్ వ‌ర్కవుట్ అయిందంటే మ‌రో రెండు సంవ‌త్సరా టాలీవుడ్‌లో ఫుల్ బిజి షెడ్యూల్స్‌తో బిజిబిజిగా మారిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: