హీరో రామ్ చరణ్ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘జంజీర్’ సినిమా వచ్చేనెల 6 వ తారీఖున విడుదల కాబోతోంది. హాట్ హీరోయిన్ గా బాలీవుడ్ ను ఒక కుదుపు కుదిపేస్తున్న హాట్ బ్యూటీ ప్రియాంకా చోప్రా ఈ సినిమాలో రామ్ చరణ్ తో కలిసి రొమాన్స్ చేస్తోంది. అపూర్వ లాఖియా దర్శకత్వం వహిస్తున్నడన్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్ ను డైరెక్టర్ అపూర్వ చాలా విభిన్న రీతిలో ప్రమోట్ చేస్తూ బాలీవుడ్ లో ఈ సినిమాకు ఒక క్రేజ్ తీసుకురావడానికి తన సర్వ శక్తులు పెట్టి కృషి చేస్తున్నాడు.

ప్రస్తుతం రామ్ చరణ్, ప్రియాంకా చోప్రా లు ఈ సినిమా ప్రమోషన్ లో బిజీగా కాలాన్ని గడుపుతున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్న ప్రియాంకా చోప్రా హీరో రామ్ చరణ్ తీరు నచ్చక చెర్రీ పై తెగ ఫైర్ అయిపోతొందట. దీనికి ప్రధాన కారణం ‘జంజీర్’ ప్రమోషన్ కార్యక్రమాలకు అనుకున్న సమయానికి ఖచ్చితంగా ప్రియాంకా హాజరు అవుతూ ఉంటే, హీరో రామ్ చరణ్ మాత్రం ఈ కార్యక్రమాలకు చాలా ఆలస్యంగా వస్తున్నాడట. దీనితో చిర్రెత్తిపోయిన ప్రియాంకా ఇలా అయితే తాను ఈ సినిమా ప్రచార కార్యక్రమాలకు రాను అని డైరెక్టర్ అపూర్వ లాఖియా కు తెగేసిచెప్పిందని, ఈ కోపం తోనే ప్రియాంకా మొన్న జరిగిన ‘తుఫాన్’ ఆడియో వేడుకకు దర్శకుడు అపూర్వ చెప్పినా సరే డుమ్మా కొట్టిందని అంటున్నారు.

వీరిద్దరి మధ్య వస్తున్న చిన్న చిన్న భేదాభిప్రాయాలతో ‘జంజీర్’ ఫిల్మ్ యూనిట్ తల పట్టుకుంటోంది అని బాలీవుడ్ టాక్. ఈ విషయాలు ఇలా ఉంటే ‘జంజీర్’ సినిమా విడుదల కాకుండానే ఈ సినిమా ప్రమోషన్ ను చూసి హీరో రామ్ చరణ్ కు ఏకంగా 10 బాలీవుడ్ సినిమాలలో అవకాశాలు వచ్చాయి అంటూ అపూర్వ లాఖియా అంటూ ఉంటే తనకు బాలీవుడ్ సినిమాలే పరమావధి గా మారడం తన కు ఇష్టం లేదని చెర్రీ అంటున్నాడు. ఇంతకీ ఈ విషయాలలో ఏది నిజమో వచ్చేనెల విడుదల కాబోతున్న ‘జంజీర్’ సినిమా రిజల్ట్ తరువాత తేలుతుంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: