హీరోయిన్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బలుపు సినిమాలతో ఒక ఊపు ఊపిన అంజలి ఆ మధ్య అజ్ఞాతంలోకి వెళ్లి అందరినీ హైరానా పెట్టిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల తర్వాత అజ్ఞాతం వీడి పిన్ని భారతీదేవి, దర్శకుడు కళంజియం వేధింపుల వల్లనే తాను ఈ పని చేసినట్లు వెల్లడించింది. ఆ తర్వాత అంజలి మళ్లీ అదృశ్యం అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

కొన్ని రోజులుగా ఆమో ఫోన్ స్విచాఫ్ వస్తుందట. ఆమె ఎవరికీ అందుబాటులోకి రావడం లేదని, ఇటీవల మద గజ రాజా సినిమా ప్రెస్ మీట్‌కు హాజరు కావాల్సి ఉన్నా డుమ్మా కొట్టినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం అంజలి ‘మసాలా' చిత్రంలో వెంకటేష్ సరసన నటిస్తోంది. ఈ సినిమా తర్వాత ఆమె ఏ ప్రాజెక్టు సైన్ చేయలేదు.

కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న గాసిప్ ఏమిటంటే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ రాజకీయ నాయకుడిని అంజలి పెళ్లాడబోతోందని, ఆ తర్వాత సినిమాలను పూర్తిగా వదిలేయాలన్న ఆలోచనలో ఉందట.. మరో వైపు అంజలి ప్రస్తుతం నటించిన ‘
 మసాలా' చిత్రంతో పాటు, ‘మద గజ రాజా' ఇంకా పోస్టు ప్రొడక్షన్ దశలోనే ఉంది. వీటి కోసం అంజలి చేయాల్సిన పనులు పెండిగులో ఉండటంతో ఆ చిత్ర నిర్మాతలు ఆందో ళనలో పడ్డట్లు టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: