పని రాక్షసుడు అని పేరు పొందిన రాజమౌళి దగ్గర పని చేయడాని అందరు భయ పడిపోతారు. కానీ ప్రతి నటుడు అయన సినిమాలో నటిద్దాం అనుకుంటాడు అదే అయన లోని మేజిక్. లేటెస్ట్ గా ‘బాహుబలి' సినిమా షూటింగ్ విషయంలో దర్శకుడు రాజమౌళి పని రాక్షసుడిగా మారి ఆ చిత్రంలో నటిస్తున్న రానాను హింస పెడుతున్నాడని అయన  చేసిన వ్యాఖ్యలను బట్టి స్పష్టం అవుతోంది. నటన  విషయంలో ఎంత  సిన్సియర్ గా ఉన్నా  24 గంటలూ విశ్రాంతి  లేకుండా పని చేయించడం అంటే నరకంలానే ఉంటుంది. కానీ రాజమౌళి ఇవన్నీ ఆలోచించకుండా రాజమౌళి తనూ కష్టపడుతూ ఆర్టిస్టులతో కూడా కష్టపడి 24 గంటలు పని చేయిస్తాడు. ఈ చిత్రంలో ముఖ్య పాత్రలో నటించిన రానా వ్యాఖ్యలను నిశితంగా పరిశీలిస్తే ఈ విషయం అర్థం అవుతుంది. ‘బాహుబలి సెకండ్ షెడ్యూల్‌లో నా పని పూర్తయింది.

ఈ షెడ్యూల్ మొత్తం ఓమారథాన్‌లా సాగింది. ఉదయం 7 గంటలకు రాత్రి 10 గంటలకు వరకు షూటింగ్. అర్థరాత్రి వరకు కూడా ట్రైనింగ్ జరిగింది' అంటూ ట్వీట్ చేసాడు. ‘ఒక వారాంతం అయితే ఆదివారం ఉదయం 7 గంటల నుంచి నాన్ స్టాప్‌గా సోమవారం ఉదయం 8 గంటల వరకు 24 గంటలు పని సాగింది' అని రాణా పేర్కొన్నాడు. ఈ బిజీ షెడ్యూల్ వల్లనే ఈ మధ్య తను తన ట్విట్టర్లో  ఎవ్వరిని పలకరించ లేక పోయానని రానా తన త్విట్ లో పేర్కున్నాడు. పని విషయం లో అంత ఏకాగ్రత ఉంది కాబట్టే  రాజ మౌళి సినిమాలకు అంత క్రేజ్. అయన సినిమాల కోసం ఎన్ని  సంవత్సరాలు  అయినా ఎదురు చూస్తూ ఉంటారు. దట్ ఈజ్ జక్కన్న..

 

మరింత సమాచారం తెలుసుకోండి: