జూనియర్ కు మెగా ఆఫర్ వచ్చింది, కాని ఆయన ఆఆఫర్ ను వదులుకోవాలా.... పట్టుకోవాలా... అంటూ తెగ మధనపడుతున్నాడు అంటున్నారు ఆయన సన్నిహితులు. కారణం ఇప్పటి వరకు ఏ తెలుగు హీరోకు దక్కని పెద్ద ఆఫర్ కావడంతో జూనియర్ ఆలోచనలో పడ్డాడట.

మూడేళ్లు, మూడు సినిమాలు, 50 కోట్లు ఇది ఆ ఆఫర్. ఇంత చక్కటి ఆఫర్ వస్తే ఎవరైనా సరే ఎగిరి గంతేస్థారు, కాని జూనియర్ ఎందుకు ఆలోచిస్థున్నాడు అన్నదే అందరికి అర్థం కాని పరిస్థితి. కాని దీనికి ఓకే చెప్పడం వైపే మొగ్గు చూపుతాడన్న వార్తలే వినిపిస్థున్నాయి.

కారణం ఈ ఆఫర్ ఇచ్చింది చలన చిత్రపరిశ్రమలో పెద్దదైన పివిపి బ్యానర్. ఈ అగ్రిమెంట్ పై జూనియర సంతకం చేస్తే ఆయన ఈబ్యానర్ పై మూడు సినిమాలు తీయాలి, ఒక్కో సినిమా తీయడానికి ఏడాది పడుతుందని కూడా పివిపి స్పష్టం చేసింది. మరి జూనియర్ ఏం చేస్తాడో చూద్దాం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: