టాలీవుడ్ టాప్ హీరోయిన్‌కి మ‌త్తులోకి ఎంట‌ర్ అయితే లైఫ్ ఎంత చిత్తుగా మారుతుందో అర్దం అవుతుంద‌ట‌. లిక్కర్‌తో లైఫ్ జ‌బ్బర్‌ద‌స్థ్ అనుకుంటే చివ‌రికి ప‌రేషాన్ అయింది. ఇదంతా చార్మి రీల్ లైఫ్ స్టోరి. ప్రేమ ఒక మైకం అంటూ లీడ్ రోల్‌తో వ‌చ్చిన చార్మి మూవీ బాక్సాపీస్ వ‌ద్ద చ‌తికిల ప‌డింది. రియ‌ల్ లైఫ్‌లోనూ హైఫై సోసైటికి అల‌వాటు ప‌డిన చార్మి, ఏ స్టోరికు ఓకే చెప్పాలో, ఏ స్టోరికు నో చెప్పాలి అర్ధం చేసుకోలేక‌పోతుంది. రీసెంట్‌గా చార్మి ముందుకు ఇటువంటి డి అడిక్షెన్ లాంటి రెండు స్టోరిల‌కు ఓకె చెప్పింద‌ట‌. ప్రేమ ఒక మైకం స్టోరి అట్టర్‌ప్లాప్ అని తెలియ‌డంతో చార్మి ఆ స్టోరిల‌కు నో చెప్పేసింది. నేను ఇక‌నుండి మందు తాగే మూవీల‌ను చేయ‌నుబాబోయ్ అంటుంద‌ట‌.

చార్మి చేత డ్రింక్ చేయించి, క‌లెక్షన్స్‌ను కొల్లగొట్టాల‌ని చూసిన నిర్మాల‌త‌కు ఇప్పుడు చార్మి నుండి షాక్ న్యూస్ ఎదురైంది. త‌న‌కి ముందస్తుగా ఇచ్చిన అడ్వాన్స్‌ల‌ను తిరిగి ఇచ్చేయాల‌ని తెలియ‌జేశారు. అయితే అందుకు ఒప్పుకోని చార్మి, వేరే క‌థ‌ల‌ను రెడీ చేసుకోండి, డేట్స్ ఇస్తాను అంటోంది. మందు తాగ‌ని స్టోరీల‌లో న‌టిస్తే మార్కెట్ చేసుకోవ‌డం క‌ష్టమే అనుకున్న ఆ నిర్మాత‌లు, చార్మి ఇచ్చిన డేట్స్‌ను మ‌రో డైరెక్టర్‌కు షిప్ట్ చేసే ప‌నిలో ఉన్నారట‌. మొత్తానికి బాక్సాపీస్ వ‌ద్ద మూవీ బోల్తా కొట్టడంతో త‌నకు ఎక్కిన హాంగ‌వ‌ర్ పూర్తిగా దిగిపోయినట్టే అని అంటున్నారు. ఈ త‌ర‌హా చిత్రాల‌కు దాదాపుగా చార్మి స్వస్తి చెప్పిన‌ట్టే అని స‌మాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: