ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీ గ‌ర్వించ‌ద‌గ్గ డైరెక్టర్ శంక‌ర్‌. అంటే త‌మిళ‌నాడు శంక‌ర్ అని. మ‌న టాలీవుడ్‌లోనూ ఓ శంక‌ర్ ఉన్నాడు. త‌నే ఎన్‌.శంక‌ర్‌. రీసెంట్‌గా తెలంగాణ ఉధ్యమంలో చురుగ్గా పాల్గొంటున్న ఈ ఎన్‌.శంక‌ర్‌ను తెలంగాణ శంక‌ర్‌గా మార్చేశారు టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రి. అయితే మ‌న టాలీవుడ్ శంక‌ర్, కోళీవుడ్ శంక‌ర్ స‌ర‌స‌న చేరిపోయాడు. ఇప్పటి వ‌ర‌కు చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ వెళ్ళిన ఎన్‌.శంక‌ర్ ఒప్పుడు ఓ భారి చిత్రాన్ని తెర‌కెక్కించే ప‌నిలో ఉన్నాడు. అదీనూ ఇండియ‌న్ యూనివ‌ర్సల్ యాక్టర్ క‌మ‌ల్‌హాస‌న్‌తో. క‌మ‌ల్ హాస‌న్‌కి ఓ క‌థ‌ను చెప్పి ఒప్పించ‌డ‌మే కాకుండా, క‌మ‌ల్‌తో శెభాష్ అనిపించుకున్నాడు. స్టోరి పూర్తి చేసుకో త్వర‌లోనే మూవీను తీద్దాం అని భ‌రోస ఇచ్చాడ‌ట‌. ఎన్‌.శంక‌ర్ క‌థ‌ను రెడీ చేసుకునే ప‌నిలో ఉన్నాడు.

క‌మ‌ల్ ఒప్పుకుంటే అత‌డితో మూవీ తీయాల‌ని నేటి టాలీవుడ్ యంగ్ డైరెక్టర్స్ ఎంతో మంది క్యూలో నిల‌బ‌డి ఉన్నారు. వారంద‌రికి ద‌క్కన ఘ‌న‌త ఎన్‌.శంక‌ర్‌కి ద‌క్కడంతో ఎన్‌.శంక‌ర్ ట్రెండ్ సెట్ చేయ‌డం ఖాయం అంటున్నారు. ఏ విధంగా ట్రెండ్ సెట్ చేస్తాడంటే క‌మ‌ల్‌,శంక‌ర్ కాంబినేష్ మూవీ తెర‌కెక్కి రిలీజ్ అయ్యే స‌మ‌యానికి ఆంధ్రప‌దేశ్ రెండు ముక్కల‌యి తెలంగాణ వుడ్‌, టాలీవుడ్ అంటూ రెండు ఫిల్మ్ ఇండ‌స్ట్రీలు త‌యార‌వుతాయి. తెలంగాణ రాష్ట్ర ద‌ర్శకుల్లో క‌మ‌ల్ హాస‌న్ తో డైరెక్ట్ చేసిన తొలి ద‌ర్శకుడు ఎన్‌.శంక‌ర్ అవుతాడు. ఇంకేముంది తెలంగాణ రాష్ట్రంలో ఎన్‌.శంక‌ర్ ట్రెండ్ సెట్ చేయ‌డం ఖాయం అంటున్నారు. ఇప్పటికే ఏ.పి.ఫిల్మ్ ఛాంబ‌ర్ రెండుగా విడిపోయింది. శంక‌ర్ సాధించిన ఘ‌న‌త‌ను తెలంగాణ ఫిల్మ్ ఛాంబ‌ర్ లో ఆనందం క‌నప‌డుతుంద‌ని టాలీవుడ్ టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: