ఎట్ ప్రెజెంట్ రామానాయుడు బ్యాన‌ర్‌లో ఓ చిన్న మూవీలో న‌టిస్తున్న ఈ చిన్నది, బిజినెస్ ఎలా చేసుకోవాలో త‌న‌ని చూసి నేర్చుకోవాల్సిందే. ముఖ్యంగా టాలీవుడ్‌కి ప్రభాస్ మూవీ బుజ్జిగాడు మేడిన్ చెన్నె మూవీతో ఎంట్రి ఇచ్చిన సంజ‌న‌, ఇండ‌స్ట్రీలోని పెద్దల‌ను ఇట్టే ఎట్రాక్ట్ చేసింది. చూడ‌టానికి బ‌బ్లీగానూ, కొద్దిగ సెక్సీగానూ ఉంటూ అంద‌రిని తెగ క‌వ్విస్తుంది. ఈ అమ్మడి స్టైల్‌ను, స్పీడ్‌ను చూసిన సిని పెద్దలు ఈ బేబికు అవ‌కాశాలు కూడ బాగానే ఇచ్చారు. అయితే మ‌న టాలీవుడ్ కంటే ముందుగానే క‌న్నడ ఇండ‌స్ట్రీ మేలుకుంది. క‌న్నడ‌లో వ‌రుస మూవీలు చేసుకుంటూ టాలీవుడ్‌లోనూ గ్యాప్ దొరికిన‌ప్పుడ‌ల్లా క‌మిట్‌మెంట్లు ఇచ్చుకుంటూ ఎప్పుడూ ఫుల్ బిజిగా ఉంటుంది.

ఏ మూవీ చేసిన అది బాక్సాపీస్ వ‌ద్ద చ‌తికిల ప‌డ‌టం కామ‌న్‌. అందులోనూ సంజ‌న చేసిన రోల్స్‌లో కొద్దిపాటి ఎక్స్‌పోజింగ్ కూడ ఎక్కువుగానే ఉంటుంది. క‌న్నడ కంటే ఎక్కువు ప‌రిచ‌యాలు సంజనాకి టాలీవుడ్‌తోనే ఎక్కువ‌. సంజ‌నాకు మూవీ ఆఫ‌ర్లు కంటే రిబ్బన్ క‌టింగ్స్‌కే ఎక్కువ డిమాండ్ ఉంది. తెలుగులో ఒక మూవీ రిలీజ్ అయ్యేలోపు, 15 క‌మ‌ర్షియ‌ల్ ఈవెంట్లకు అటెండ్ అక్కడ రిబ్బన్ క‌టింగ్‌ల‌ను చేస్తుంటుంది. అందులోనూ సంజ‌న చాలా ఫ్లెక్సిబుల్‌. ఒక‌సారి డీల్ ఓకె అయితే ఇక నో టాకింగ్. త‌న ప‌నేదో త‌ను చూసుకొని వెళుతుంది. అందుకే నేనేం, చిన్నపిల్లనా అంటూ సురేష్ ప్రొడ‌క్షన్స్‌లో హీరోయిన్‌గా చేస్తుంది. మొత్తానికి సంజ‌న బిజినెస్ జెట్ స్పీడ్‌లో ఉందంటున్నారు టాలీవుడ్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: