మ‌హేష్ సెకండ్ టీజ‌ర్‌ను యూ ట్యూబ్ నుండి తొల‌గించారు. దానికి సంబంధించిన కార‌ణాలను శోధించే ప‌నిలో యూ ట్యూబ్ ఉంది. ఈ టీజ‌ర్‌ను త్వర‌లోనే యు ట్యూబ్ రి రిలీజ్ చేయోచ్చంటున్నారు. ఇప్పటికే 14 రీల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ దీనికి సంబంధించిన లీగ‌ల్‌ డాక్యుమెంట్స్‌ను యు ట్యూబ్‌కి అంద‌జేసింది. ఆ వీడియోపై అండ‌ర్ రివ్యూ ఇంకా కొన‌సాగుతుంది. టీజ‌ర్‌ రిలీజ్ అయిన రెండో రోజుకే 20 ల‌క్షల‌ను దాటి సంచ‌ల‌నం అయితే, అందులోని నిజ‌మైన క్లిక్స్ ఎంత ఉంటాయో అనేది లేటెస్ట్ టాక్‌. కొంద‌రు ఫేక్ హిట్స్‌తో చేసిన ముప్పుతోనే ఈ వ‌న్ మూవీ టీజ‌ర్ ను యూ ట్యూబ్ నుండి తొల‌గించ‌బ‌డింది.

యూ ట్యూబ్ ఎన‌లిస్టుల‌ ప్రకారం ఆ టీజ‌ర్‌కు దాదాపు 10 నుండి 12 ల‌క్షల ఫేక్ హిట్స్ కేవ‌లం కొద్ది గంట‌ల్లోనే వ‌చ్చి ఉంటాయ‌ని చెబుతున్నారు. ఒక సారి యూ ట్యూబ్‌లో వీడియోను అప్‌లోడ్ చేస్తే ఒక రోజు పూర్తి అయిన త‌రువాతే పూర్తి హిట్టింగ్స్ ఏంటో తెలుస్తుంది. ఈ లోపు 3 గంట‌ల‌కు ఒక‌సారి ఎంత మంది చూశారో చూపించినప్పటికి ఫైన‌గ‌ల్‌గా అందులోని నిజ‌మైన హిట్స్ ఎన్నో ఫిల్టర్ చేసి తిరిగి త‌రువాత రోజు ఆ కౌంట్‌ను చూపిస్తుంది. ఈ విధంగా చూసుకుంటే వ‌న్ టీజ‌ర్‌కి కేవ‌లం గంటల్లోనే ల‌క్షల హిట్స్ వ‌చ్చాయి. కొంత మంది కొన్ని సాప్ట్‌ వేర్‌ల‌తో ఈ వీడియోను ట్యాపంరింగ్ చేశార‌ని తెలుస్తుంది. దాదాపు రెండు , మూడు రోజుల్లో వ‌న్ టీజ‌ర్‌పై 10 ల‌క్షల ఫేక్ హిట్లను అదే ప‌నిగా చేయ‌డంతో యూ ట్యూబ్ నుండి ఆ వీడియో తొల‌గించ‌డింది. ఓ పాపుల‌ర్ వీడియోకి ఈ ర‌క‌మైన ఫేక్ హిట్స్ తో యూ ట్యూబ్ నుండి తొల‌గించ‌డ‌టం, త‌రువాత తిరిగి రావ‌డం చాలా కామ‌న్ అంటున్నారు యూ ట్యూబ్ నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: