పెద్ద పెద్ద కత్తులతో విరోధులను నరుకుతూ, భారీ భారీ డైలాగ్స్ తో మెరుపులు మెరిపిస్తూ ఉగ్ర నరసింహ అవతారంలా మాస్ క్యారెక్టర్లు చేసే జూనియర్ ఎన్టీఅర్, పండువెన్నెలలో అలిగిన తన ప్రేయసి కోపం తీర్చమంటూ “జాబిల్లి నువ్వైనా చెప్పమ్మా” అంటూ సమంత తో ఆడిపాడుతున్న జూనియర్ ‘రామయ్యా వస్తావయ్యా’ లేటెస్ట్ టీజర్ అందరినీ అలరిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన మొట్ట మొదటి టీజర్ లో ‘బుడ్డోడు బుడ్డోడు అంటే గుడ్డలు ఉడదీసి కొడతా’  అంటూ పంచ్ డైలాగ్స్ చెప్పిన జూనియర్ ఇప్పుడు క్యూట్ బ్యూటీ సమంత తో తన రొటీన్ కు భిన్నంగా క్లాసీ లుక్ తో నెమ్మదిగా పారే జలపాతంలా స్టెప్స్ వేస్తూ తన అభిమానుల హృదయాలను కొల్లగోడుతున్నాడు.

సెప్టెంబర్ 8వ తారీఖున విడుదల కాబోతున్న ఈ సినిమా ఆడియో వేడుకకు సంబంధించి ప్రచారాన్ని కల్పిస్తూ విడుదల అయిన ఈ టీజర్ ఇప్పుడు ఇంటర్ నెట్ లో నందమూరి అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. మరి చందమామను జూనియర్ మాయ చేయగలగాడా లేదా అనే విషయం ఈ పాట చూసి మీరే తేల్చుకోండి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: