జంజీర్ మూవీను చూసి బ‌య్యర్స్ వ‌ణికిపోతున్నారు. ఇది టాలీవుడ్ టాక్ కాదు. బాలీవుడ్ మీడియా బ‌ల్లగుద్ది చెబుతున్న మాట‌. మేట‌ర్ ఏంటంటే రిల‌య‌న్స్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన ఈ జంజీర్ మూవీకు సంబంధించిన ప్రివ్యూ షోను డ్రిస్ట్రిబ్యూట‌ర్లకి ప్రత్యేకంగా షో వేసి చూపించారు. మూవీ మొత్తం చూసిన పంపిణీ దారులు, దీనికి సంబంధించిన రివ్యూను అక్కడే కుండ బ‌ద్ధలు కొట్టి అక్కడే చెప్పి వెళ్ళిపోయారు. ఆనాటి సూప‌ర్‌స్టార్ అమితాబ్‌బ‌చ్ఛన్ జంజీర్ ఏమిటి, ఈ జంజీర్ ఏటిమి.? అర్ధం లేకుండా ఉంది అని రిల‌య‌న్స్ పి.ఆర్‌.మేనేజ‌ర్‌కు చెప్పి వెళుతున్నార‌ట‌. ఈ మూవీ టాలీవుడ్ నేటివిటికి ద‌గ్గర‌గా ఉంది, బాలీవుడ్ మూవీ స్టైల్లో లేదని అంటున్నారు.

అయితే ఇది జంజీర్‌కు సంబంధించిన టాక్ కాదు, ఎవ‌రో కావాల‌నే ఈ విధ‌మైన నెగిటివ్ టాక్స్‌ను మార్కెట్లోకి తీసుకువెళుతున్నారు. ద‌య‌చేసి న‌మ్మోద్దు అంటుంది రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్. జంజీర్‌కి సంబంధించిన నేష‌న‌ల్‌, ఓవ‌ర్సీస్ బిజినెస్ అంతా ముందుగానే అయిపోయింది. ఇప్పుడు మేము ఎవ‌రికి కొత్తగా ఏమి చూపించ‌లేదు. నెగిటివ్ టాక్స్‌ను న‌మ్మోద్దు. ఒక్క ఆంద్రా,త‌మిళ్‌నాడు బిజినెస్ మినహా రిలయ‌న్స్ జంజీర్ మూవీను ఎప్పుడో అమ్మేసింది. జంజీర్‌ను చూసిన డిస్ట్రిబ్యూట‌ర్లు ఎక్స్‌ట్రీమ్ హిట్‌ టాక్ ఇచ్చారు అని వివ‌ర‌ణ ఇచ్చేకునే వ‌ర‌కూ వెళ్ళింది. మొత్తంగా ఈ మూవీ త్వర‌లోనే రిలీజ్‌కి సిద్దమ‌వుతుండంతో బాలీవుడ్ చేసే మేజిక్స్‌కి రామ్‌చ‌ర‌ణ్ మూవీ ఎటువంటి టాక్‌ను సంపాదించుకుంటుందో అని చ‌ర‌ణ్‌కి టెన్షన్ ప‌ట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: