టాలీవుడ్‌లో ఆఫ‌ర్లు ఉన్నప్పటికీ, రేటు పెంచేసి బాలీవుడ్‌కి చెక్కేసింది గోవా బ్యూటి ఇలియాన‌. బాలీవుడ్ ఎంట్రి ఇచ్చిన ఇలియాన త‌న మొద‌టి మూవీతో బాక్సాపీస్ హీరోయిన్‌గా మారిపోయింది. బ‌ర్ఫీ మూవీతో ఇలియానాకు భారీగా ఆఫ‌ర్లు వ‌స్తాయ‌నుకుంటే ఆ త‌రువాత కూడ చాలా కాలం హిందీ మూవీల కోసం వెయిట్ చేయాల్సి వ‌చ్చింది. ఎంతో మంది మేనేజ‌ర్లను, హీరోల‌ను, ప్రొడ్యూజ‌ర్లను బ‌తిమిలాడినా ఇలియానాకు ఆఫ‌ర్ల క‌ష్టాలు త‌ప్పలేదు. చివ‌రికి షాహిద్ క‌పూర్ ఇలియానాకు ఆఫ‌ర్ ఇచ్చి, బాలీవుడ్‌కి మ‌రింత ద‌గ్గర చేశారు. బ‌ర్ఫి మూవీలో ఇలియాన అందాల‌కు అంత‌గా ప‌ని లేక‌పోవ‌డంతో, ఇలియాన త‌నేంటో నిరూపించుకునే క‌మ‌ర్షియ‌ల్ మూవీ ఇప్పుడు వ‌చ్చింది. ఫ‌టా పోస్టర్ నిక్లా హీరో మూవీతో షాహిద్‌తో లిప్‌లాక్ ఇచ్చింద‌ని ఇప్పటికే తెగ టాక్స్ వినిపిస్తున్నాయి.

ఇంకొంచెం ముందుకు వెళితే షాహిద్‌క‌పూర్‌,ఇలియానల మ‌ధ్య డేటింగ్ న‌డుస్తుంది, వీరిద్దరూ ఒకొరికొక‌రు అంటూ క‌లిసి తిరుగుత‌న్నారని బాలీవుడ్ టాక్‌. షాహిద్ ఫారిన్ టూర్‌ల‌కి ఇలియాక కూడ వెళుతుంద‌ట‌. ఇద్దరూ చాలా ప్రవేట్ ఈవెంట్స్‌కు జంట‌గా వెళుతున్నారు. షాహిద్ క‌పూర్‌, క‌రీనా క‌పూర్ లు విడిపోయిన త‌రువాత షాహిద్ ఒంట‌రిగానే ఉన్నాడు. ప్రియాంక చోప్ర,క‌రీనా క‌పూర్‌తో ఎఫైర్ న‌డిపి, ఎప్పుడూ హాట్ టాపిక్‌గా ఉండే షాహిద్‌కపూర్ కొద్దిగా గ్యాప్ తీసుకొని ఈ గోవా బ్యూటితో మ‌ళ్ళీ ఎఫైర్ షురూ చేశాడు. షాహిద్ అంటే ఇలియాకు తెగ ఇష్టమ‌ట‌. మొత్తంగా చెప్పాలంటే వీరిద్దరూ డేటింగ్ చేసుకుంటున్న విషయాన్ని ఇలియానే చాలా సందార్భాల్లో త‌న స్నేహితుల‌తో మాట్లాడుతుంద‌ట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: