హీరోయిన్ అమలాపాల్ కు మంచి నటిగా పేరుంది. రామ్ చరణ్ హీరో గా నటించిన ‘నాయక్’ లో తన శక్తి మేరకు అందాలను ఆరబోసి పేరు తెచ్చుకున్న అమలా, బన్నీ తో కూడా అదే హవా కొనసాగిద్దామని అనుకున్నా అదృష్టం కలిసి రాకపోవడం తో ప్రస్తుతం అమలా హవా మన టాలీవుడ్ లో కొద్దిగా నత్త నడక నడుస్తోంది. అయినా ఏదో సందర్భంలో అమల తన కామెంట్స్ తో మీడియా లో హాట్ టాపిక్ గానే ఉంటూ వస్తోంది. ఈమధ్య ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన గ్లామర్ రహస్యాన్ని విప్పింది.

తాను ప్రస్తుతం ఈనాడు చేరుకున్న స్థానానికి తన పాజిటివ్ థింకింగ్ యే కారణం అని చెపుతూ అందరూ తనలాగే ఎప్పుడూ నవ్వుతూ ఉంటే పాజిటీవ్ వైబ్రేషన్స్ దానంతట అవే వస్తాయని దానివల్ల ఏ వ్యక్తికైనా తమ అందం ద్విగిణికృతం అవుతుందని చెపుతూ, అదే తన బ్యూటీ సీక్రెట్ అంటోంది. అందుకే అమలా చిన్న జోక్ వినిపించినా తెగ నవ్వేస్తోందట. దానివల్ల తనకి షూటింగ్ లలో ఎదురు అయిన చికాకు, అలసట పోతాయని చెప్పుకోస్తోంది ఈ కోలీవుడ్ బ్లాక్ బ్యూటీ. తాను ఇంత గ్లామరస్ గా ఉండడానికి తాను తరచూ చూసే టామ్ అండ్ జెర్రీ సినిమాలే కారణం అని చెపుతున్న అమల ను ఆదర్శంగా తీసుకొని మన రాష్ట్రంలో కూడా అందంగా కనిపించాలి అని అనుకుంటున్న అమ్మాయిలంతా అమల బ్యూటీ టిప్స్ ను ఫాలో అయితే బాగుంటుందేమో. ఇన్ని విషయాలు తెలిసిన అమల హీరోయిన్ గా కన్నా పర్సనాలిటీ ట్రైనర్ గా బాగా సక్సెస్స్ అవుతుందేమో అని అనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: