సీత‌మ్మ క‌ష్టాల‌ను తెర‌కెక్కిస్తున్నారు. యువ ద‌ర్శకుల‌కు టాలీవుడ్ మ‌ల్టీ స్టార‌ర్‌ సీత‌మ్మగా చెప్పుకుంటున్న అంజ‌లి జీవివ‌తంపై ఆస‌క్తి క‌లుగుతుంది. ముఖ్యంగా అంజ‌లి రీల్ అండ్ రియ‌ల్ లైఫ్ రెండూ ఎంతో ఆస‌క్తిగా మారింది. ఈ విష‌య‌మే యువ ద‌ర్శకుల ఎదుగుద‌ల‌కు మంచి క‌థాంశంగా మారింది. దీనికి ఇంకొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ క‌లిపి మంచి సిల్క్ స్టోరిగా మార్చనున్నారు. అంటే సిల్క్‌స్మిత పై తీసిన మూవీలు ఎంత పాపుల‌ర్ అయ్యాయో, స‌రిగ్గా అంజ‌లి రీల్ అండ్ రియ‌ల్ లైఫ్ స్టోరీను అంత పాపుల‌ర్ చేయటానికి రెడీ అవుతున్నారు. దీనికి సంబంధించిన స్టోరి డిస్కష‌న్స్ కోళీవుడ్ అప్పుడే మొద‌లుపెట్టింది. ఓ యువ త‌మిళ ద‌ర్శకుడు ఈ స్టోరీతో ఓ ప్రొడ్యూజ‌ర్ వ‌ద్దకు వెళ్ళి స్టోరిను ఓకే చేయించుకున్నాడు.

ఈ మూవీ అంతా అంజ‌లి పిన్ని,బాబాయ్‌ల మ‌ధ్య తిరుగుతూ ఫిల్మ్ కెరీర్‌లో ఏ విధంగా టాప్ పొజిష‌న్‌కు వెళ్ళింది, అక్కడ నుండి ఏ విధంగా కొంద‌రి చేతిలో బంధి అయింద‌నే క‌థాంశంగా తీసుకున్నారు. అంజ‌లి ఫిల్మ్ కెరీర్ మొద‌ట‌గా సాదాసీదాగానే మొద‌ల‌యింది. పిన్ని,బాబాయ్‌లు ఏం మాట‌లు చెప్పారు తెలియ‌దు. మొత్తానికి అంజ‌లీను మంచి ట్రాక్‌లో పెట్టారు. త‌రువాత పిన్ని,బాబ‌య్‌ల‌తో వ‌చ్చిన మ‌న‌స్పర్ధలు చిలికి చిలికి గాలివాన‌గా మారి చివ‌ర‌కు అంజ‌లి సోలాగా మారింది. ఈ స్టోరి తెర‌కెక్కితే అంజ‌లి ఫిల్మ్ కెరీర్ దాదాపు డైల‌మాలో ప‌డిన‌ట్టే. స‌క్సెస్ స్టోరీగా అంజ‌లి మూవీ తెర‌కెక్కితే త‌న ఫిల్మ్ కెరీర్‌కి ప్లస్ అవుతుంది కాని, నెగిటివ్ షేడ్స్‌తో తెర‌కెక్కితే, చీక‌టిలోనే ఉండాల్సి వ‌స్తుంద‌ని కోళీవుడ్ టాక్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: