రాంచరణ్ నటించిన తూఫాన్ బాగోతం లీకయింది అంటున్నారు టాలీవుడ్ వర్గాలు. పేరులోనే తూఫాన్ తప్ప సినిమాలో పసలేదని అంటున్నారు. కారణం బాలీవుడ్ లో జంజీర్ పై అప్పుడే నెగెటివ్ టాక్ వచ్చేసింది. కేవలం ప్రియాంకచోప్రా బొమ్మను చూపించి జంజీర్ ను పాస్ చేయించాలని చూస్తున్నారట. కారణం రాంచరణ్ ఇక్కడ టాప్ అయితే మాత్రం అక్కడ కొత్తే కదా....

పైగా అక్కడ జంజీర్ కు క్లీన్ అంటే ‘యూ’ సర్టిఫికేట్ ఇచ్చారు, అదే సినిమా రీమేక్ తూఫాన్ కు ఇక్కడ పెద్దలకు మాత్రమే అంటే ‘ఎ’ సర్టిఫికేట్ ఇచ్చారు. అక్కడ అంత మంచి సినిమా ఎలా అయింది, ఇక్కడికి రాగానే అంత డర్టీ దృష్యాలు ఏమున్నాయి అన్న సందేహాలు రానే వచ్చాయి. ఐటం సాంగ్ తో అందాలు గుప్పించారేమో అన్న అనుమానాలు కూడా టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. కారణం అది తుస్సు అన్న వాదన వినిపిస్తున్న నేపథ్యంలో ఇలాగైనా కొంత లాభపడతామన్న ఆలోచన కావచ్చు అంటున్నారు.

పైగా రాంచరణ్ కూడా తూఫాన్ ఆడియో ఫంక్షన్ లో తూఫాన్ పై అంత ఆశలు పెట్టుకోలేదన్నారు. నిజానికి రీమేక్ చేయడమే సాహసమని, ఏదో ప్రయత్నం చేసామని అన్నారు. ఎంత ఫ్లాఫ్ టాక్ వచ్చినా సరే ఎవరి సినిమాపై వారు ఇలాంటి టాక్ చేసుకోరు. అందుకే తూఫాన్ బాగోతం బయటపడినట్టే అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: