కోస్తా జిల్లాలలో సమైఖ్య ఉద్యమం ఉవ్వెత్తున ప్రస్తుతం జరుగుతూ ఉండడంతో ప్రజలకు సహకరించని కోస్తా తీర ప్రాంతానికి చెందిన నాయకులపై కూడా విపరీతమైన కోపం, ద్వేషంతో ఆ ప్రాంత ప్రజలు నలిగిపోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కి రాష్ట్రం లోని అన్ని ప్రాంతాలలోనూ ఉన్న అభిమానుల సంఖ్య ఒక వంతు అయితే చిరంజీవి సినిమాలను తమ గుండెలపై పెట్టుకొని మెగా హీరోగా తలకేక్కించుకున్న కృష్ణ, తూర్పు,పశ్చిమ గోదావరి, ఉత్తరాంధ్ర ప్రజల పిచ్చి అభిమానం గురించి చెప్పాలి అంటే మాటలు చాలవు. అటువంటి చిరంజీవి సమైఖ్య ఉద్యమానికి ద్రోహం చేసి ద్రోహి గా మారిపోయాడు అంటూ కోస్తా జిల్లాలలోని ప్రజలతో పాటు కొంతవరకూ చిరంజీవి అభిమానులు కూడా బాధపడుతున్న విషయం వాస్తవం.

ఈ పరిస్థితులలో ఈనెల 6వ తారీఖున విడుదల కాబోతున్న రామ్ చరణ్ ‘తుఫాన్’ సినిమా భవితవ్యం కోస్తా ప్రాంతాలలో ఎలా ఉంటుంది అన్న అంశంపై సర్వత్రా ఆశక్తి నెలకొని ఉంది. చిరంజీవి పై ఉన్న కోపం తో ఎట్టి పరిస్థితులలోను ‘తుఫాన్’ సినిమాకు ఆటంకాలు కలిగించి, అలాగే చెర్రీ సినిమా పోస్టర్లు, ఫ్లెక్సీలు కనిపించకుండా చేసి తమ అక్కసు ను తీర్చుకోవాలని కోస్తా తీర ప్రాంతంలోని కొంతమంది భావిస్తూ, ఇప్పటికే దీనికి సంబంధించి రంగం సిద్ధం చేశారని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఇదే కోస్తా తీర ప్రాంత ప్రజలు నిన్న జరిగిన పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ వేడుకలకు సంబంధించి వెలసిన పోస్టర్లను కాని ఫ్లెక్సీలను కాని ఏ మాత్రం చెక్కు చెదరకుండా ఉంచడం చూస్తూ ఉంటే తుఫాన్ కు సంబంధించి వస్తున్న వార్తలు అన్నీ రూమర్లు అనుకోవాలా..? లేక చాణుఖ్యుడు రాజనీతి సిద్దాంతంలో చెప్పినట్లుగా శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్లుగా చిరంజీవి తో సరైన సంబంధాలు లేని పవన్ ను ఆదరించడం ద్వారా చిరంజీవి కి ఒక సంకేతం పంపాలని కోస్తా ప్రజలు ఆలోచిస్తున్నారా..? అంటూ రకరకాల చర్చలు పవన్ రామ్ చరణ్ సినిమాలపై పలు కోస్తా ప్రాంతాలలో జరగడం చూస్తూ ఉంటే పవన్ సినిమాకు లైన్ క్లియర్ అయినట్లే అనిపిస్తోంది అంటున్నారు టాలీవుడ్ వర్గాలు. ఇంతకీ 6వ తారిఖు శుక్రువారం ఏమి జరుగుతుంది అన్న ఆత్రుత అటు చిరంజీవి కుటుంబ సభ్యులలోను ఇటు మెగా అభిమానులలోను కూడా ఉంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: