హోల్ ఆంధ్రలో పవన్ కళ్యాణ్ సేఫ్ పొజిషన్ లో ఉన్నాడట, కారణం శతృవుకు శతృవు మంచి మితృడు అన్న చందంగా మారిందట పవన్ కళ్యాణ్ పరిస్థితి. అందుకే ఏది జరిగినా మన మంచికే అంటారు. దీంతో ‘అత్తారింటికి దారేది’ సినిమాకు ఇక హోల్ ఆంధ్రప్రదేశ్ లో క్లియరెన్స్ వచ్చినట్టేనని అంటున్నారు టాలీవుడ్ తో పాటు రాజకీయ వర్గాల వారు కూడా.

సీమాంధ్రలో సమైక్య ఉద్యమకారులు, మెగా అభిమానులు రాంచరణ్ ‘ ఎవడు’ సినిమా పోస్టర్లను కాల బెట్టారు, ఎవడు సినిమా డిస్ట్రిబ్యూషన్ కార్యాలయం ఎదుట ఆందోలన చేసారు, ఎవడు ను అడ్డుకుంటామని హెచ్చరించారు. కాని ఇప్పటి వరకు ‘అత్తారింటికి దారేది’ సినిమా జోలికి వెల్లలేదు, డైరెక్టుగా ఆసినిమాను అడ్డుకంటామని ఇంత వరకు అనకపోవడమే  ఈవాదనకు కారణం అంటున్నారు.

పవన్ తో చిరంజీవికి విభేదాలున్నాయని లోకమంతా కూడైకూస్తోంది. చిరంజీవి కాంగ్రెస్ లో చేరడం పవన్ కు కూడా ఇష్టం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. రాంచరణ్ సినిమా ఫంక్షన్స్ కు పవన్, పవన్ ఫంక్షన్స్ కు రాంచరణ్, చిరంజీవిలు రావడం లేదు. సీమాంధ్రలో చిరంజీవి రాజీనామా చేయడంలేదనే కోపంతోనే రాంచరణ్ సినిమాలను అడ్డుకుంటున్నారు. తెలంగాణలో కూడా చిరంజీవి సమైక్యం అన్న ముద్ర ఏనాడో పడింది. అందుకే హోల్ ఆంధ్రప్రదేశ్ లో చిరంజీవిపై ఉన్న కోపం పవన్ కు కలిసి వస్తుందోన్న మాట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: