భారతీయ సినిమా 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మూకీ సినిమాగా మొదలైన మన ఇండియన్ సినిమా నేడు 3డి స్థాయికి ఎదిగి రకరకాల గ్రాఫిక్స్ మాయజాలంతో ఈరోజు మనందరినీ ఆనంద పరిచే స్థాయికి ఎదిగి ప్రపంచ వ్యాప్తంగా మన భారతీయ సినిమాకు ఒక గుర్తింపును తెచ్చుకుంది. ఈ నేపధ్యంలో మన భారతీయ సినిమా వందేళ్ళ పండుగను చెన్నైలో మన దక్షణాది ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అత్యంత ఘనంగా ఈనెల సెప్టెంబర్ 21నుండి 24వరకు నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. తమిళ, కన్నడ, మలయాళ రంగానికి చెందిన అనేక మంది  టాప్ హీరోలు, హీరోయిన్స్ పాల్గొంటున్న ఈ ఉత్సవాలలో మన తెలుగు హీరోల హడావిడి లేకపోవడం ఈ ఉత్సవాలకు వెలితిగా ఉందని ఈ కార్యక్రమ నిర్వాహకులు భావిస్తున్నారట.

మన తెలుగు యంగ్ హీరోలు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లుఅర్జున్ లకు తమిళనాడు సినిమా ప్రేక్షకులలో మంచి క్రేజ్ ఉండటంతో ఈ హీరోలంతా ఈ ఉత్సవాలలో పాల్గొంటే నిండుతనం వస్తుందని నిర్వాహకులు భావించి మనహేరోలను పిలిచినా మనహీరోలు రకరకాల కారణాలతో రాలేము అని చెపుతున్నారట. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ఉద్యమాల సెగ ఒక కారణం అయితే కోలీవుడ్ హీరోల మధ్య తమకు పెద్ద గుర్తింపు ఉండదనే భావన మరొక కారణమట. ఈ నేపధ్యంలో ఈ ఉత్సవాల నిర్వహణ బాధ్యతను చూస్తున్న నిర్మాత సి. కళ్యాణ్  మనసులో ఒక ఆలోచన తట్టి ఈ సమస్యను పరిష్కరించి అందరి హీరోలు వచ్చేలా చేయాలి అంటే దానికి మోహన్ బాబు కుమార్తె లక్ష్మి మంచు మాత్రమే సమర్ధురాలు అని తలంచి లక్ష్మి మంచు సహాయాన్ని కోరాడట.

దీనితో ఈ మధ్యనే నరేంద్ర మోడి దగ్గర మంచి మార్కులు కొట్టేసి తన నాయకత్వ ఘనతను చాటుకున్న లక్ష్మీ ప్రసన్న మన టాలీవుడ్ హీరోలను అంతా ఏకంచేసి మన తెలుగు సినిమా గొప్పతనాన్ని ఈ సినిమా ఉత్సవాలలో చాటే పనిలో బిజీగా ఉందట. మన దక్షణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మన రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ లతో పాటు అనేకమంది ప్రముఖులు పాల్గొనే ఈ ఉత్సవాలలో లక్ష్మీప్రసన్న మాటలు విని మన టాలీవుడ్ హీరోలు ఎంతవరకు ఈ ఉత్సవాలలో పాల్గొంటారో చూడాలి....

 

మరింత సమాచారం తెలుసుకోండి: