బాలీవుడ్ బాక్సాపీస్ బాద్‌షా అంటే ఖ‌చ్చితంగా స‌ల్మాన్‌ఖాన్ అనే చెబుతారు. బాలీవుడ్‌లో 100 కోట్లు, 200 కోట్లు,300 కోట్లకు లీడ‌ర్ స‌ల్మాన్‌ఖానే. ఎవ‌రైనా స‌ల్మాన్‌ఖాన్ రికార్డుల‌ను బ్రేక్ చేయాల‌నే క‌సితో మూవీల‌ను నిర్మిస్తారు. మ‌రిఇలాంటి స్టార్ హీరో క‌న్ను టాలీవుడ్ మెగాహీరో మీద ప‌డింది. జంజీర్ మూవీలో బాలీవుడ్‌కి ఎంట్రి ఇచ్చిన మెగాహీరో రామ్‌చ‌ర‌ణ్ మూవీను స‌ల్మాన్ చూశాడంట‌. రామ్‌చ‌ర‌ణ్ న‌ట‌న‌కు,స్టైల్‌కి ఇంప్రెస్ అయిన స‌ల్లూభాయ్‌, రామ్‌చ‌ర‌ణ్ బాలీవుడ్ ఎంట్రిను మ‌రింత ప‌దిలం చేయ‌టానికి ఓ ఆఫ‌ర్ ఇచ్చాడు. నా అప్‌క‌మింగ్ హోమ్ ప్రొడ‌క్షన్‌లో మూవీ స్టార్ట్ అవుతుంది, మీరు ఒక రోల్ చేస్తారా అని క‌బురు పంపాడ‌ట‌. ఇంకేముంది ఈ న్యూస్ బాలీవుడ్‌లో తెగ‌చెక్కెర్లు కొడుతుంది. 
బాలీవుడ్ కండ‌ల‌వీరుడు జంజీర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌కు ఆఫ‌ర్ ఇచ్చాడ‌ని తెలియ‌డంతో జంజీర్ మూవీకు ఎక్కడ‌లేని హైప్ క్రియోట్ అయింది. జంజీర్ మూవీ రిలీజ్‌కి మ‌రో రెండు రోజుల్లో ఉండ‌గా చ‌ర‌ణ్‌కు ఇటువంటి ఆఫ‌ర్ రావ‌డంతో, జంజీర్ మూవీను చూసేందుకు స‌ల్మాన్ అభిమానులు తెగ ఉత్సాహ‌ప‌డుతున్నారు. స‌ల్మాన్‌కి ప్రపంచ‌వ్యాప్తంగా అత్యధిక అభిమానులను క‌లిగిఉన్న హీరో కావ‌డంతో, స‌ల్మాన్ నోటి నుండి రామ్‌చ‌ర‌ణ్ పేరు వినిపించే స‌రికి ఇంకేముంది రామ్‌చ‌ర‌ణ్‌కు విప‌రీత‌మైన పాపులారిటి వ‌చ్చేసింది. ఎట్ ప్రెజెంట్ స‌ల్లూభాయ్ మెంట‌ల్ మూవీ షూటింగ్‌లో ఉన్నాడు. దీని త‌రువాత త‌న సొంత ప్రొడ‌క్షన్‌లో సల్మాన్ మూవీ తీస్తున్నాడు. ఇందులో రామ్‌చ‌ర‌ణ్ న‌టించటానికి ఒప్పుకుంటే, బాలీవుడ్‌లో చ‌ర‌ణ్‌కు తిరుగులేన‌ట్టే అని బాలీవుడ్ సైతం చ‌ర‌ణ్ ను ఫోక‌స్ చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: