ఈరోజు దేశం అంతా మన మాజీ రాష్ట్రపతి, తత్వజ్ఞాని డా.సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి ఉత్సవాలను టీచర్స్ డే గా అత్యంత పూజనీయ భావంతో జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో మన పవర్ స్టార్ కూడా ఉపాధ్యాయుడిగా మారి కొంత మంది యువ సినిమా కళాకారులను తీర్చి దిద్దే పనిలో పడ్డాడని తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం మన ‘గబ్బర్ సింగ్’ హీరో తను స్థాపించిన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంస్థ కోసం ఒక మంచి ప్రదేశాన్ని జూబ్లి హిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాలలో వెతుకుతూ ఉన్నట్లుగా తెలుస్తోంది. తన ఆలోచనలకు, ఆశయాలకు తగ్గట్టుగా ఈ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై మంచి సినిమాలు తీయడమే కాకుండా నేటి టాలీవుడ్ రంగంలో అవకాశాల కోసం వెతుకుతూ ఉన్న కొంతమంది యంగ్ టాలెంట్ ను ప్రోత్సహించే ఉద్దేశం కూడా ఈ ప్రొడక్షన్ హౌస్ కి ఉంది అని తెలుస్తోంది.

మరొక ఆశక్తికరమైన విషయం ఏమిటంటే, గతంలో పవన్ చేత స్థాపించబడ్డ ‘కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్’ ను తిరిగి చైతన్య వంతం చేసి, ఈ సంస్థ పేరుపై కొన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చెయ్యాలని పవన్ తలపోస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఒక వైపు తన సినిమాలలో బిజీగా ఉంటూనే ఇలా కొత్త కొత్త కార్యక్రమాల వైపు పవన్ అడుగులు వేయడం చూస్తూ ఉంటే చాలామంది ఇప్పటికే ఉహిస్తున్నట్లుగా 2014 ఎన్నికలకు కాకపోయినా, 2019 ఎన్నికలకు టార్గెట్ గా పవన్ తన రంగం సిద్ధం చేసుకుంటున్నాడు అనే విషయానికి నిదర్శనంగా పవన్ ఒక ప్రత్యేకమైన ఆఫీసు ను తన సంస్థ కోసం భాగ్యనగరం నడివొడ్డున ఏర్పాటు చేస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. రాజకీయాలను ప్రక్షాళన చేసే ఆవేశం పవన్ కు ఉన్నా పవన్ ఆలోచనలు, ఆశయాలు నేడు నానాటికీ పతనం అయిపోతున్న సామాజిక రాజకీయ రంగాలలో ఎంత వరకూ ఆచరణ సాధ్యమో చూడాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: