తల్లి తండ్రులు సంపాదించిన కీర్తి ప్రతిష్టలను ఆసరాగా చేసుకుని వారి తల్లి తండ్రులు పేరు ప్రఖ్యాతలు సంపాదించిన రంగంలోనే విజయం సాధించడానికి మన సెలెబ్రెటీల పిల్లలు ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ దీనికి పూర్తి భిన్నంగా క్రియేటివ్ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి కుమారుడు కార్తికేయ జీవితం కనిపిస్తుంది. తనకు 15 సంవత్సరాలు వచ్చినప్పుడే సినిమా ఫోటో గ్రాఫర్ గా మారుదామని తన తండ్రి నిర్మిస్తున్న ‘యమదొంగ’ సినిమాకు ఫోటో గ్రాఫర్ సెంధిల్ దగ్గర అసిస్టెంట్ కెమెరామెన్ గా చేరి అక్కడ సరిపడక డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో చేరి ‘ఈగ’ సినిమాకు సహాయ దర్శకుడిగా పనిచేసాడు.

కానీ అది కూడా ఈ జక్కన్న కుమారుడుకి నచ్చక పోవడంతో కొన్ని షార్ట్ ఫిలిమ్స్ నిర్మాణం చేసి సొంతంగా ఒక టీమ్ ను తయారుచేసుకుని సర్వీస్ అపార్ట్ మెంట్స్ బిజినెస్ లోకి రావడమే కాకుండా కొన్ని వీడియోలు తయారుచేసే పనికూడా ప్రారంభించాడు కార్తికేయ. ఇవి చూస్తూనే తన తండ్రి ప్రస్తుతం నిర్మిస్తున్న ‘బాహుబలి’ సినిమాకు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ గా తన బాధ్యతలు నిర్వర్తిస్తూ తను ఏమిటో తాను ప్రూవ్ చేసుకుంటాను అంటున్న కార్తికేయ తనకు రెస్టారెంట్ బిజినెస్ అంటే చాలా ఇష్టమని చెపుతున్న ఈ 21 సంవత్సరాల స్టార్ డైరెక్టర్ కుమారుడు భవిష్యత్ లో దర్శకుడు అవుతాడా, వ్యాపార వేత్త అవుతాడా లేదా తన తండ్రిలాగే డైరెక్టర్ అవుతాడా అనే విషయం పై క్లేరిటీ లేకపోయినా స్టార్ డైరెక్టర్ కుమారుడు కాబట్టి కొన్ని ప్రముఖ ఇంగ్లీష్ పత్రికలు అప్పుడే కార్తికేయ గురించి వార్తలు వ్రాస్తూ సంచలనాలు సృస్టిస్తున్నాయి. ఇంతకీ మన జక్కన్న కొడుకు రేపటి కాలంలో ఏమవుతాడో చూడాలి....

మరింత సమాచారం తెలుసుకోండి: