అదొక అందమైన కల. ఆ కలలో ప్రేయసి ప్రియుడితో కలిసి యుగళగీతం పాడుకుంటూ ఉంటుంది. ఈ యుగళగీతం మధ్య ప్రేక్షకులు ఆ సినిమాను చూస్తూ మైమరచిపోతారని ఆ సినిమా దర్శకుడు భావించారు. షాహిద్ కపూర్, ఇలియానా జంటగా రాజ్ కుమార్ సంతోషి దర్శకత్వం వహిస్తున్న ‘ఫటా పోస్టర్ నిక్ లా హీరో’ సినిమాలో పాటకు సంబంధించిన వ్యవహారం ఇది. ఇంత అందమైన పాటను ఏ స్విట్జర్లాండ్ లోనో అందమైన ప్రదేశాల మధ్య తీస్తారు అని మన గోవా సుందరి ఇలియానా అనుకుందట. కాని ఈ పాటను ముంబాయి లోనే తీసేద్దామని హీరో షాహిద్ కపూర్ అనడంతో షాక్ అయిందట ఇలియానా.

హీరో గారు కోరినట్లే ఈ పాట షూటింగ్ ముంబాయి లో మండుతున్న సూర్యుడు మధ్య ఒక అందమైన లొకేషన్ లో చిత్రీకరించడం మొదలు పెట్టాడట. అప్పటికే షాక్ అయిపోయిన ఇలియానా ఆ ఎండను తట్టుకుంటూ ఏదో విధంగా పాటలో డాన్స్ చేస్తుందట. అయితే ఈ పాటలో ఇలి బేబీ ఏడు రకాల దుస్తులతో వెరైటీగా కనిపించాలి. షాట్ షాట్ కి మధ్య ప్రతీ రెండు నిమిషాలకు ఒకసారి తన డ్రెస్ నుఇ మార్చుకోమని దర్శకుడు ఇలియానా కి చెప్పేవాడట. ఇలియానా ఇంకా తన డ్రెస్ ను మార్చుకుంటూ ఉండగానే షాట్ రెడీ తొందరగా వచ్చేసేయ్ అని హీరో షాహిద్ కపూర్ దగ్గర నుంచి తన సెల్ కు మెసేజ్ లు వస్తూ ఉంటే కోపం పట్టలేక షాహిద్ ను చంపేసి, ఆ షూటింగ్ నుంచి వెళ్ళిపోవాలని అనిపించింది అంటూ ఈమధ్య ఇలి బేబీ ఒక ఇంటర్వ్యూ లో చెప్పింది. టాలీవుడ్ నుంచి దూరం అయ్యాక ఏదో రాకరాక ఒక బాలీవుడ్ సినిమా తగిలితే ఇలియానా ఇలా ప్రవర్తిస్తే ఇక తనకు కెరియర్ ఉండదు కదా. ఈ విషయం పాపం మన కరువుకాలపు సుందరి కి తెలియదు అనుకోవాలి. ఏది ఏమైనా షాహిద్ కపూర్ అదృష్ట వంతుడు అనే అనుకోవాలి. ఎందుకంటే కోపం తో ఇలియానా అతడిని చంపలేదు కాబట్టి.

మరింత సమాచారం తెలుసుకోండి: