సామాన్యంగా మన బ్యూటీలు బాగా గ్లామరస్ గా కనిపించీ బికినీ లు కూడా వేసుకొని హడావుడి చెయ్యాలి అని వారితో సినిమాలు తీస్తున్న దర్శకనిర్మాతలు అడిగితే అప్పటిదాకా వారు ఒప్పుకున్నా పారితోషికానికి మించి డిమాండ్ చేస్తారు. అయితే ఒక విచిత్రమైన వార్త హీరోయిన్ సమంత పై వినిపిస్తోంది. ప్రస్తుతం సమంత ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమాలో యంగ్ టైగర్ తో కలిసి రొమాన్స్ చేస్తోంది. వీరిద్దరి పై దర్శకుడు హరీష్ శంకర్ స్పెయిన్ లో ఒక పాటను చిత్రీకరిస్తున్నాడు. అయితే ఈ పాటలో తనను కొంచెం హాట్ గా చూపెట్టమని మన మాయలేడి స్వయంగా దర్శకుడు హరీష్ శంకర్ ను అడగడం తో ఖంగు తిన్నాడట గబ్బర్ సింగ్ డైరెక్టర్.

ఈ పాట కోసం తయారు చేసిన కాస్ట్యుమ్స్ ను కొద్దిగా కురచచేయమంటో౦దట సమంత. దీనికి ప్రధాన కారణం సమంత ఈ సంవత్సరం నటించిన సినిమాలు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘ఏం మాయ చేశావే’, ‘జబర్దస్త్’ సినిమాలలో సమంత క్లాసి లుక్ తో కనిపించడం తో తన మాసీ లుక్ ను రామయ్యా వస్తావయ్యా లో చూపెట్టి జనాన్ని అధరకోడదామని సమంత అనుకుంటో౦దట. అందుకే సమంత తనంత తాను తనకు హాట్ లుక్ కావాలి అంటూ దర్శకుడు హరీష్ శంకర్ ను అడిగిందని ఫిల్మ్ నగర్ టాక్. అనుకోని ఈ పరిణామానికి కొద్దిగా హరీష్ షాక్ అయినా స్పెయిన్ లో మాత్రం సమంత ను ఎంత వరకూ హాట్ గా చూపించగలిగితే అలా చూపించేలా తన ప్రయత్నం చేస్తున్నాడట. ఎన్టీఆర్ ఈ సినిమాలో క్లాస్ గా కనిపిద్దామని కోరుకుంటూ ఉంటే, సమంత మాత్రం మాసీ గా కనిపిద్దామని కోరుకోవడం ఆశ్చర్యకరమే.
 

మరింత సమాచారం తెలుసుకోండి: