టాప్ హీరో మహేష్ బాబు హైదరాబాద్ టాప్ ఏరియా బంజారాహిల్స్ లో  హల్ చల్ చేస్తున్నాడు, గత కొన్ని రోజులుగా ప్రిన్స్ చేస్తున్న హంగామాతో బంజారా కొండలు పిండి అయ్యేలా దద్దరిల్లుతున్నాయి. ఇంతకీ మహేష్ బాబు చేస్తున్న హంగామా ఏమిటి అనే కదా.. మీడౌటు.

ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకుని హీరోగా నటిస్తున్న ‘వన్’ సినిమా పూర్తిచేయడానికి నిరంతర షూటింగ్ ప్రక్రియ జరుగుతోంది. ఇందులో భాగంగా బంజారాహిల్స్ లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. చాలా టెర్ ఫిక్ చూపులతో కనిపించబోతున్న మహేష్ బాబు ను చూడ్డానికి  ఈ ప్రాంతంలో అభిమానుల కోలాహలం పెరిగింది. దీంతో బంజారాహిల్స్ లో సందడి వాతావరణం నెలకొంది.

ఇప్పటికే 45 రోజుల పాటు అమెరికాలో షూటింగ్ జరుపుని వచ్చిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ షూటింగ్ ను పూర్తి చేసి మిగిలిన సన్నివేశాల చిత్రీకరణకు బ్యాంకాక్ వెల్లనున్నారు మహేష్ బాబు. ఈ చిత్రంలో ప్రిన్స్ కొడుకు కూడా లిటిల్ మహేష్ బాబు గా కన్పించబోతున్నాడట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: