ఒక‌ప్పుడు అమితాబ్ న‌టించిన షోలే మూవీను రిమేక్ చేసిన రాంగోపాల్‌వ‌ర్మ, ఆ మూవీ రిజ‌ల్ట్‌ను చూసి ఎందుకు చేశానురా అని మ‌ళ్ళీ అపాల‌జీను కోరుకున్నాడు. రామ్‌గోపాల్‌వ‌ర్మ కి ఆగ్ అంటూ షోలే రిమేక్‌ను భారి ప్రమోష‌న్‌తో ఆనాడు రిలీజ్ చేశాడు. ఆనాటి క్లాసిక్ బ్లాక్‌బ‌స్టర్ మూవీ షోలేకు, వ‌ర్మా షోలే రిమేక్‌కి ఏ మాత్రం పొంత‌న‌లేదు. ఆనాటి నుండి అమితాబ్ న‌టించిన క్లాసిక‌ల్ మూవీల జోలికి వెళ్ళకూడ‌ద‌ని వ‌ర్మ నిర్ణయించుకున్నాడు. తాజాగా మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ తేజ న‌టించిన జంజీర్ రిజ‌ల్ట్‌పై వ‌ర్మ కామెంట్ చేశాడు. అయితే ఈ కామెంట్ చ‌ర‌ణ్‌కి ఇండైరెక్ట్‌గానే త‌గిలింది. చ‌ర‌ణ్ ఫెర్ఫార్మెన్స్‌ను ఏ మాత్రం ట‌చ్ చేయ‌కుండా వ‌ర్మ ట్వీట్ చేశాడు.

'అమితాబ్ ఫిల్మ్స్ జంజీర్ అండ్ షోలే మూవీల‌ను ఏవ‌రూ ట‌చ్ చేయ‌కూడ‌దు. ఒక వేళ ట‌చ్ చేస్తే అవి మ‌న‌ల్ని వెంబ‌డించి పీక్కుతింటాయి డ్రాకులాస్ లాగ' అని అన్నాడు. దీంతో చ‌ర‌ణ్ న‌టించిన జంజీర్‌ మూవీ బాలీవుడ్‌లోనూ బ్యాడ్ టాక్‌ను సంపాదించుకుందని తెలియ‌ప‌రిచాడు.. అమితాబ్ జంజీర్‌ను, రామ్‌చ‌ర‌ణ్ జంజీర్‌ను ఏ మాత్రం పోల్చుకోలేక‌పోతున్నారు సిని అభిమానులు. ఈ మ‌ధ్య కాలంలో వ‌ర్మ, ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గురించి తెగ ట్వీట్స్ చేస్తున్నాడు. లేటెస్ట్‌గా మెగాప్యామిలి హీరో రామ్‌చ‌ర‌ణ్‌పై ఇలా ఇండైరెక్ట్‌గా కామెంట్ చేయ‌డంపై రామ్‌చ‌ర‌ణ్ స్టామినాను త‌క్కువ చేసి మాట్లాడ‌మే అని టాలీవుడ్ బావిస్తుంది. అయితే షోలే మూవీ రిమేక్‌తో పోల్చుకుంటే ఈ జంజీర్ రిమేక్ రిజ‌ల్ట్ చాలా వ‌ర‌కు బెట‌ర్‌. వ‌ర్మ షోలే రిమేక్ అత్యంత ధారుణ‌మైన డిజాస్టర్‌. ఈ రెండింటిని వ‌ర్మ ఏవిధంగా కంపెరిజ‌న్ చేశాడో అర్ధం కావ‌డం లేదంటున్నారు మెగా అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: