హీరో నాగార్జున రామ్ చరణ్ ను ఆకాశానికి ఎత్తేశాడు. జూలై30న వెలువడిన రాష్ట్ర విభజన ప్రకటన నేపధ్యంలో సీమాంద్రాలో సమైఖ్య ఉద్యమం ఉవెత్తున లేవడంతో జనజీవానమే కాకుండా ఆ ఉద్యమ వేడి టాలీవుడ్ కుకూడా తగిలి పెద్ద సినిమాలుగా పేరు తెచ్చుకున్న ‘ఎవడు’, ‘అత్తారింటికి దారేది’ సినిమాలతో పాటు ‘రామయ్యా వస్తావయ్యా’’ ‘బాయ్’ సినిమాల పరిస్థితిని కూడా అగమ్యగోచరంలోకి నెట్టేసింది. ఈ పరిస్థుతులలో రామ్ చరణ్ నటించిన తుఫాన్ సినిమా అటు తెలంగాణాలో ఇటు కోస్తా ఆంధ్రాలో ఉద్యమ కారుల బెదిరింపుల మధ్య విడుదలై సినిమా మొదటి రోజు మొదటి షో కు సమస్యలు ఎదురైనా నెమ్మదిగా రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైన అన్ని దియేటర్లలోను ప్రదర్శించే స్థాయికి చేరుకుంది.

లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం చెర్రీ ‘తుఫాన్’ ఫ్లాప్ టాక్ ను తెచ్చుకున్నా మొదటిరోజు 8 కోట్లు వసూలు చేసి చరణ్ స్టామినాను చాటిందని అని నాగ్ అంటూ ప్రస్తుతం టాలీవుడ్ హీరోలలో అందరికంటే చిన్న వాడైన రామ్ చరణ్ ఈ రాజకీయ ఉద్యమాల నేపధ్యంలో ధైర్యంగా ముందుకు వచ్చి పెద్ద హీరోలకు దారి         చూపించాడు అంటూ చెర్రీని పొగుడుతూ ఫోన్ చేసి అభినందించాడని అంటూ ఫిలింనగర్ టాక్. మరి ధైర్యం చేసి అబ్బాయ్ చూపించిన మార్గాన్ని బాబాయ్ ఆచరిస్తాడో లేదో చూడాలి   

మరింత సమాచారం తెలుసుకోండి: