రజనీకాంత్ అంటే సూపర్ స్టార్ అన్న పదానికే హడల్ అన్నది అందరికి తెలిసిందే. ఆయన ఫీల్డ్ లోకి వచ్చాడంటే మహామహులైన హీరోలు మట్టి కరవాల్సిందే అని మరో సారి నిరూపించాడు. ఆయన ప్రతిష్టాత్మకంగా తీస్తున్న ‘కుచాడైయాన్’ యూట్యూబ్ లో ఆల్ టైం రికార్డు సాధించింది.

నిన్నటి దాకా నేనంటే నేనని పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబులు మేమంటే మేమే యూట్యూబ్ హీరోలం అంటూ జబ్బలు చరుచుకుంటున్న విషయం తెలిసిందే. అత్తారింటికి దారేది, రామయ్యా వస్తావయ్యా, వన్ –నేనొక్కడినే వంటి సినిమాలు మూడు రోజుల్లో పదిలక్షల వ్యూస్ కు చేరుకుంటేనే ఆహా.. ఓహో.. అనుకున్నాం.

కాని రజనీకాంత్ ‘ కుచాడైయాన్’ టీజర్ సోమవారం విడుదల కేవలం ఒక్క రోజులో 9లక్షల వ్యూస్ దాటి మన వాళ్ల రికార్డులనే కాదు దేశ వ్యాప్తంగా ఏ హీరో కూడా సాదించని రికార్డు కొట్టేసి అందరి రికార్డులను పత్తా లేకుండా చేసింది అంటున్నారు. ఇదే సినిమాను తెలుగులో ‘విక్రమసింహా’ గా వస్తోంది. ఏకంగా 125 కోట్లతో ఈ సినిమాను తెరపైకి ఎక్కిస్తున్నారు. ఈ సినిమాలో దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: