చిరంజీవి రాజకీయం తన కొడుకు రాంచరణ్, తమ్ముడు పవన్ కళ్యాణ్ లను మాత్రమే ఇబ్బంది పెడుతుంది అనుకుంటున్నవారికి ఓ షాకింగ్ న్యూస్. వీరిద్దరి కంటే భవిష్యత్తుపై ఎంతో ఆశతో టాలీవుడ్ లోకి ప్రవేశించాలనుకున్న ఓ హీరోయిన కెరియర్ ను చిత్తడి చేస్తోందని అంటున్నారు. ఈ విషయంలో సదరు హీరోయిన్ చాలా అప్ సెట్ గా ఉందట కూడా.

కన్నడలో మంచి ఫాంలో ఉన్న హీరోయిన ప్రణితనే చిరంజీవి రాజకీయానికి టాలీవుడ్ లో భవిష్యత్తు ప్రశ్నార్థకం చేసుకుంటోంది. చిరంజీవి పై రాష్ట్ర ప్రజల్లో ఉన్న కోపమే పవన్ నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా వాయిదా పడింది, ఎప్పుడు విడుదల చేస్తారో తెలియని పరిస్థితి.

ఈ సినిమాతో పవన్ సరసన హీరోయిన్ గా నటించిన ప్రణిత ఇది విడుదలయి హిట్టయితే తనకు టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు వస్తాయని ఆశగా ఉంది. ఎవరైనా హీరోయిన్లుగా ఎదగాలనుకుంటే అగ్రహీరోలతో భారీ చిత్రాలలో వస్తే అది వారి భవిష్యత్తుకు బాటలు వేస్తుంది. ఇప్పుడు ఆఅవకాశం లేక, కొత్త సినిమాలు రాక ప్రణిత తెగ ఇబ్బందుల్లో ఉంది అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: