టాలీవుడ్, కోలీవుడ్ లాంటి ప్రాంతీయ భాషా సినిమాలలో నటించే కధానాయకులు బాలీవుడ్ లో నటించాలనే కలలు కంటూ ఉంటారు. అలాగే బాలీవుడ్ లో నటించే టాప్ హీరోయిన్స్ కోరిక హాలీవుడ్ పై ఉంటుంది. ఐశ్వర్యారాయ్, మల్లికా షెరావత్ లాంటి హీరోయిన్స్ ఇప్పటికే బాలీవుడ్ సినిమాలలో నటించి ప్రపంచ వ్యాప్తంగా తమ ఇమేజ్ ని పెంచుకున్నారు. ప్రస్తుతం ఆ లిస్టు లో ప్రధమ స్థానంలో ఉన్న బాలీవుడ్ లక్కీ హీరోయిన్ దీపికా పడుకొనే కు హాలీవుడ్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది అన్న సంగతి తెలిసిందే. దీపిక ను హాలీవుడ్ లో ‘ఫాస్ట్ అండ్ ఫ్వురియస్’ సిరిస్ సినిమాలు తీసే నిర్మాణ సంస్థ తమ ఏడవ సినిమా గురించి దీపికను సంప్రదించింది. దీపిక కూడా హాలీవుడ్ సినిమా అనగానే ఎగిరిగంతేసింది. అయితే అక్కడే సమస్య వచ్చిపడింది.

ఈ సినిమా నిర్మాణ సంస్థ వారు దీపికను ఈనెల నుండి జనవరి వరకూ అమెరికాలోని ఈ సినిమా షూటింగ్ నిమిత్తం పూర్తిగా ఉండాలి అని షరతులు పెట్టారు. దీనితో ఖంగుతిన్న దీపిక తన హాలీవుడ్ సినిమా విషయంపై వెనక అడుగు వేసి ఈ అవకాశాన్ని ఒదులు కుంది. దీనికి కారణం ప్రస్తుతం దీపిక షారుఖ్ ఖాన్ తో ‘హ్యాపీ న్యూ ఇయర్’ అనే సినిమా చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఈ డిసెంబర్ కు కాని పూర్తి అవదట. దీనితో ఏమీ చెయ్యలేక ‘ఫాస్ట్ అండ్ ఫ్వురియస్’ సీరిస్ లో వచ్చిన అవకాశాన్ని ఒదులుకుంది. ఇప్పటికే ఈ సంస్థ నిర్మించిన ఆరు సినిమాలు 15,000 కోట్ల కలెక్షన్స్ ను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసి రికార్డు సృష్టించింది. కాని పాపం దీపిక షారుఖ్ కోసం 15,000 ల కోట్ల ను వదులుకున్న హీరోయిన్ గా బాలీవుడ్ రికార్డు కు ఎక్కింది. ఏది ఏమైనా ప్రస్తుతం అదృష్టమహాదశ నడుస్తున్న దీపికకు ఇది ఒక దురదృష్టం అనుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: