హీరోయిన్ రిచాగంగోపాద్యాయతో ఎగిరి గంతులేసేందుకు లేటెస్టుగా రూ.60లక్షలు పెడుతున్నాడట నాగార్జున. చిత్రం కాకపోతే మరేంటి అనుకుంటున్నారా, హీరోయిన్ తో చిందులేసేందుకు హీరో ఖర్చుపెట్టుకోవడమేమిటి, కాని నాగార్జునకు మాత్రం అది తప్పలేదు, ఎందుకంటే ఆ సినిమాకు నిర్మాత కూడా నాగార్జునే కాబట్టి.

శరవేగంతో పూర్తి చేసి అక్టోబరు 4న తన ‘భాయ్’ చిత్రాన్ని పూర్తిచేస్తున్నాడు నాగార్జున. దీనికోసం శుక్రవారం నుంచి అన్నపూర్ణ స్టూడియోస్ రిచాగంగోపాద్యాయతో చివరిపాటను చిత్రీకరిస్తున్నారు. ఈ పాట మొత్తం మాస్ మసాలా అట, భాస్కరభట్ల రాసిన పాటకు రాజసుందరం సంగీత దర్శకత్వం చేస్తున్నాడు.

100 మంది డ్యాన్సర్లతో తీస్తున్న పాట ఈ సినిమాకు హైలెట్ అంటున్నారు. ఈ ఒక్క పాట కోసమే నాగార్జున 60లక్షలు ఖర్చుచేస్తున్నాడని సమాచారం. ఈ సినిమా ఆడియో ఈనెల 20న విడుదల చేస్తున్నారు. వీరభద్రయ్య చౌదరి దర్వకత్వంలో వస్తున్న ఈ సినమా భారీ హిట్టవుతుందని అంచనా పెట్టుకున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: