అందరూ టాప్ పొజిషన్ కి చేరాలన్న ఆశతోనే ఇండస్ట్రీలో అడుగు పెడతారు. ఆ స్థాయికి చేరడానికే కష్టపడతారు. కొందరికి అదృష్టం కలిసొస్తుంది. కొందరికి అందరి ద్రాక్షలా ఊరిస్తూ ఉంటుంది. అన్నీ జరిగితే ఆనందమే. కానీ అనుకున్నది జరక్కపోతే బాధ లేకుండా ఎందుకుంటుంది! ఒకవేళ లేదన్నా కూడా అది అబద్ధమే అవుతుంది. అలాంటి అబద్ధాన్ని చాలా సునాయాసంగా చెప్పేస్తోంది హన్సిక.

మిసమిస మేనిఛాయతో, నిండైన అందాలతో కుర్రకారు గుండెల్ని కొట్టింది కానీ, పెద్ద హీరోల సరసన చోటు దక్కించుకుని బాక్సాఫీసు రికార్డుల రుచిని చూడలేకపోయింది హన్సిక. రామ్, అల్లు అర్జున్, ఎన్టీయార్, విష్ణు లాంటి కుర్ర హీరోలతో జతక్టింది కానీ... మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోల సరసన పిసరంత చోటు సంపాదించలేకపోయింది. తమిళంలో కూడా అదే పరిస్థితి. బొద్దుగా ఉండేవాళ్లంటే పడి చచ్చిపోయే తమిళులు ఆమెలో ఖుష్బూని చూసుకోబట్టి అక్కడి వెలిగిపోయింది కానీ, అక్కడ కూడా ఆమె పెద్దగా సాధించిందేమీ లేదు.

ఆ విషయంలో బాధ ఎందుకు ఉండదు చెప్పండి! కానీ నాకేమీ లేదు అంటూ మూతి ముప్పై వంకర్లు తిప్పుతోంది అమ్మడు. ఏ అవకాశం వస్తే అందులో చేసుకుంటూ పోతాను తప్ప అది చేయాలి ఇది చేయాలి, వాళ్లతో చేయాలి వీళ్లతో చేయాలి అని వెంపర్లాడను, స్టార్ హీరోలతో చేయాలన్న ఆశా లేదు, వాళ్లతో చేయలేకపోయానే అన్న ఫీలింగూ లేదు అంటూ ఏకధాటిగా మాట్లాడేసింది. అబద్ధం ఈజీగానే చెప్పేసింది కానీ, మనతో దాన్ని నమ్మింపజేయడం అంత ఈజీ కాదు కదా! ఆ విషయం తెలియడం లేదు పాపం హన్సికకి!

మరింత సమాచారం తెలుసుకోండి: