ప్రశుతం తెలుగు సినిమా నిర్మాణ రంగంలో చాల మార్పులు చోటు చేసుకుంటూ ఒక ప్రొఫిషనల్ వ్యాపారంలా మార్పులు చెంది మన తెలుగు సినిమా నిర్మాణ రంగం అనేక మార్పులకు లోనవుతూ రాబోతున్న సంవత్సరాలలో మన సినిమా పరిశ్రమ తీరు పూర్తిగా మారిపోతుందని అంటున్నారు. ప్రముఖ దర్శకులు పూరిజగన్నాద్, రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, సుకుమార్ లాంటి క్రియేటివ్ దర్సకులంతా సొంత ప్రొడక్షన్ కంపెనీలు స్థాపించి చిన్న సినిమాల నిర్మాతలుగా మారిపోవడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. బడా హీరోలతో ఫారెన్ లోకేషన్స్, భారీ సెట్ల నడుమ 50 కోట్ల బడ్జెట్ కు తక్కువ కాకుండా సినిమాలు తీస్తూ నిర్మాతల డబ్బును ఖాళీ చేసే ఈ క్రియేటివ్ దర్సకులంతా చిన్న సినిమాల నిర్మాతలుగా మారిపోయి అటు పెద్ద హీరోలతో బడా సినిమాలు తీస్తూ ఇటు చిన్న హీరోలతో చిన్న సినిమాలు తీసే పెద్ద నిర్మాతలుగా మారిపోవడం టాలీవుడ్ బడా నిర్మాతలకు షాక్ ఇస్తోందట. ఈ ట్రెండుకు మొదటిగా శ్రీకారం చుట్టింది పూరిజగన్నాద్ ‘ఈడియట్’, ‘143’, ‘పోకిరి’ వంటి సినిమాలను నిర్మించి కాసులు పండించుకున్న పూరి మళ్ళీ ‘హార్ట్ ఎటాక్’ తో నిర్మాతగా మారుతున్నాడు.

అదేవిధంగా మన జక్కన్న రాజమౌళి ‘అందాల రాక్షసి’ సినిమా ద్వారా నిర్మాతగా మారిపోయాడు. అంతేకాకుండా ప్రస్తుతం రాజమౌళి తీస్తున్న ‘బాహుబలి’ సినిమాలో కూడా ఆయనకు షేర్ ఉందనే విషయం ప్రచారంలో ఉంది. ఇక లేటెస్ట్ గా దర్శకులుగా పేరు గాంచిన త్రివిక్రమ్, సుకుమార్ లాంటి దర్శకులు తమ అదృస్టాన్ని నిర్మాతలుగా పరీక్షించుకో బోతున్నారు. ఇదే కోవలో దర్శకుడు మధురా శ్రీధర్ కూడా ఉన్నారు. ఇలా టాలీవుడ్ బిగ్ డైరెక్టర్లు అంతా నిర్మాతలుగా మారిపోతే మన బడా నిర్మాతలకు స్థానం ఎక్కడా అనే మాట వినిపిస్తోంది. అంతేకాకుండా ఈరోజు టాప్ యంగ్ హీరోలులా వెలిగిపోతున్న మన హీరోలను నిలబెట్టిన వీరంతా చిన్న హీరోల వైపు యూటర్న్ తీసుకుంటే రాబోతున్న కాలంలో మన బడా యంగ్ హీరోలకు కష్టకాలం వేచి ఉన్నట్లే అనిపిస్తోంది అంటూ ఫిలింనగర్ లో వార్తలు హాల్ చల్ చేస్తున్నాయి... 

మరింత సమాచారం తెలుసుకోండి: