ఇద్దరు అంద‌గెత్తల మ‌ధ్య హీరో కం డైరెక్టర్స్ న‌లిగిపోతున్నారు. ఏవ‌రిని కాద‌న‌లేని ప‌రిస్థితి వాళ్ళది. ఈ గొడ‌వంతా మ‌హేష్‌బాబు, శ్రీనువైట్ల అప్‌క‌మింగ్ ఫిల్మ్ ఆగ‌డు మూవీలో జ‌రుగుతుంది. మొన్నటి వ‌ర‌కూ ఆగ‌డు మూవీలో త‌మ‌న్నాని రిప్లేస్ చేసి శ్రుతిహాస‌న్ సైన్ చేస్తుంద‌ని తెగ టాక్స్ వినిపిస్తున్నాయి. శ్రుతిహాసన్‌కి వ‌స్తున్న వ‌రుస ఆఫ‌ర్లకు అంద‌రి హీరోయిన్లు క్లీన్ బౌల్డ్ అవుతున్నారు. అటు బాలీవుడ్‌లో ఆసిన్ అవ‌కాశాల‌కి చెక్ పెట్టిన శ్రుతిహాస‌న్‌, ఇటు టాలీవుడ్‌లో త‌మ‌న్నా అవ‌కాశాల‌కు చెక్ పెట్టింది. ఇదిలా ఉంటే శ్రుతిహాస‌న్‌కి చిన్న ట్విస్ట్ ఇచ్చారు ఆగ‌డు మూవీ డైరెక్టర్‌. శ్రుతిహాస‌న్‌ను మెయిన్ హీరోయిన్‌గా తీసుకుంటూ, త‌మ‌న్నాను సెకండ్ హీరోయిన్‌గా ఖ‌న్‌ఫ‌ర్మ్ చేసెందుకు రెడీ అయ్యారు.

ఇదే విష‌యాన్ని శ్రుతిహాస‌న్‌కి చెబితే స‌సేమీరా నో అనేసింది. తీసుకుంటే ఎవ‌రో ఒక్కరినే తీసుకోండి. త‌మ‌న్నా ఉంటే నేను న‌టించిను. మీరే ఆలోచించుకోండి అంటూ డైరెక్టర్స్‌కే ఆఫ‌ర్ ఇచ్చింది. శ్రుతిహాస‌న్ చెప్పిన ఆన్సర్‌కి ఏం చేయాలో అర్ధకావ‌డం లేదు డైరెక్టర్‌కి. శ్రుతి ఈ విధ‌మైన ఆన్సర్  ఇవ్వటానికి కార‌ణం త‌మ‌న్నానే. ఊస‌ర‌వ‌ల్లి మూవీలో ఇద్దరి హీరోయిన్స్‌ను తీసుకోవాల‌ని ప్లానింగ్స్ జ‌రుగుతున్నప్పడు, త‌మ‌న్నా శ్రుతిహాస‌న్ ఉంటే న‌టించ‌న‌ని తేల్చి చెప్పింద‌ట‌. అందుకే త‌మ‌న్నా పై రివేంజ్‌ను తీర్చుకోవాల‌ని శ్రుతి ఇప్పుడు సిల్వర్ స్ర్కీన్‌లో త‌మ‌న్నాకి స్క్రీన్ స్పేస్ ఇవ్వద‌లుచుకోలేదు. వీరిద్దిరికి ఏవిధంగా సెటిల్ చేస్తారో ఆగ‌డు మూవీ యూనిట్‌కే అర్ధం కావ‌డంలేదంట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: