మెగా హీరోల పరువు గంగపాలు కాకుండా పవన్ కళ్యాణ్ కాపాడుతాడా... అంటూ మెగా ఫ్యామిలీ హీరోలందరు గంపెడాస పెట్టుకున్నారు. కారణం రాంచరణ్ తుప్పు రేక్కొడుతాడు అనుకున్న జంజీర్, తూఫాన్ తుస్సు మంది, అంతకు ముందు నాయక్ కూడా అంతంత మాత్రమే.

ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ విషయానికి వస్తే జులాయి జూలు రాలగొడితే ఇద్దరమ్మాయిలతో కూడా ఆ ఇమేజిని అంత తేలేకపోయింది. మిగిలింది పవన్ కళ్యాణ్, గబ్బర్ సింగ్ తో మెగా హీరోల హవాను టాలీవుడ్ లో ఆకాశాన్ని తాకేంత వరకు తీసుకు వెల్లాడు.

కాని అంతలోనే కెమెరామెన్ గంగతో రాంబాబుతో బోల్తా పడ్డాడు. ఇక వరుస విజయాలు లేక ఇమేజి పడిపోతున్న మెగా ఫ్యామిలి పరువు నిలబెట్టే మరో అవకాశం పవన్ కళ్యాణ్ కే దగ్గరలో ఉంది. అదే అత్తారింటికి దారేది. ఈ సినిమా కనుక గబ్బర్ సింగ్ లెవల్లో హిట్టు కొడితే అది మెగా హీరోలందరి పరువును ఇండస్ట్రీలో కాపాడుతుంది అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: