మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ హీరో అమీర్ ఖాన్ బాలీవుడ్ సినిమా చరిత్రలోని అత్యంత పెద్ద కిస్సింగ్ సీన్ లో నటించి ఒక సరికొత్త రికార్డు సృష్టిస్తాడు అనే వార్త టాక్ ఆఫ్ ది బాలీవుడ్ గా మారింది. హీరో అమీర్ హాట్ హీరోయిన్ అనుష్క శర్మతో కలిసీ ‘పికే’ అనే హిందీ సినిమాలో ఈ అత్యంత పొడువైన కిస్సింగ్ సీన్ లో నటిస్తాడట. ఈ సినిమాలోని ఒక రొమాంటిక్ సన్ని వేశంలో ఈ సీన్ ఉంటుందట.

హీరో అమీర్ ఖాన్ వయస్సులో సరిగ్గా సగం వయస్సు ఉండే అనుష్క శర్మతో అమీర్ ఇలా లాంగ్ కిస్సింగ్ సీన్ లో నటించడం చర్చనీయాంశంగ మారింది. అదీకాకుండా బాలీవుడ్ సినిమా చరిత్రలోనే అత్యంత పొడవైన ముద్దుసన్ని వేసం కావడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ఇప్పటి వరకు అమీర్ ఖాన్ దాదాపుగా తనతో నటించిన అందరు హీరోయిన్లతో లిప్ లాక్ సీన్లలో పాల్గొన్నాడు. కరిష్మా కపూర్, జుహి చావ్లా, కరీనా కపూర్, సోనాలి బింద్రే ఇలా చాలా మందిని ముద్దు పెట్టుకుని అలాంటి సీన్లు చేయడంలో ఆరితేరిపోయాడు మన హీరో అమీర్ ఖాన్.

హాట్ హీరోయిన్ అనుష్కా శర్మకు కూడా ముద్దు సన్నివేసాలలో నటించడం అందివేసిన చేయి. గతంలో హీరో ఇమ్రాన్ ఖాన్ తో ముద్దు సీనులు చేసి అదరగొట్టిన రికార్డు అనుష్కకు ఉంది. ఇప్పుడు అటువంటి రికార్డులను తిరగ రాస్తూ అనుష్క అమీర్ ఖాన్ తో ఈ ‘పికే’ సినిమాలో ఈ ముద్దు సీన్ లో నటించి ఎలా అదరగొట్టిoదో తెలియాలి అంటే ఈ సినిమా విడుదలఅయ్యే 2014 వరకు ఆగాలి. ఇంతకీ ఈ లాంగెస్ట్ ముద్దు సీన్ కు మన సెన్సార్ బోర్డు సభ్యులు ఏమంటారో చూడాలి... 

మరింత సమాచారం తెలుసుకోండి: