బాల‌కృష్ణ అప్‌క‌మింగ్ ఫిల్మ్ బోయపాటి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతుంది. ఈ మూవీలో బాల‌కృష్ణ గెట‌ప్ సింహా మూవీ కంటే విభిన్నంగా ఉండ‌బోతుంది. బాల‌కృష్ణను ఉద్దేశించి ప్రత్యేకంగా కొన్ని పంచ్ డైలాగ్స్ అలాగ్ ప‌వ‌ర్ పుల్ సీన్స్‌ను క్రియోట్ చేశాడు బోయ‌పాటి. సింహా మూవీలో రాయ‌ల్ ఎన్ ఫీల్డ్ పై వ‌చ్చి శ‌త్రువుల గుండెల్లో ధ‌డ పుట్టించిన ఈ నంద‌మూరి సింహం, ఈ సారి మ‌రో న‌యా మోడ‌ల్ బైక్‌పై రైడ్ చేసేందుకు రెడీ అయ్యాడు. ఈ బైక్‌ను బోయ‌పాటి ద‌గ్గరుండి డిజైన్ చేయించాడ‌ట‌. అందుకే బాల‌య్య బైకు టాపిక్ ఇప్పుడు టాలీవుడ్ టాపిక్ అయింది.

ఎట్ ప్రెజెంట్ ఈ మూవీ పోస్ట్‌ప్రొడ‌క్షన్ ద‌శ‌లో ఉంది. ఈ మూవీను 14 రీల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ నిర్మాత‌గా ఉంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బ‌డ్జెట్‌తో బాల‌య్య మూవీ తెరకెక్కుతుంది. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా, ఖర్చుకి వెనకాడకుండా నిర్మిస్తున్నారు. సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలోని మ‌రో హీరోయిన్‌కి సంబంధించిన చ‌ర్చలు జ‌ర‌గుతూనే ఉన్నాయి. మొత్తంగా బోయ‌పాటి, బాల‌య్యకు బైకుల పిచ్చి బాగానే అంటించాడ‌ని అంటున్నారు. ఏది ఏలాగున్నా బాల‌య్య, కొత్తగా డిజైన్ చేసిన ఈ బైకులో శ‌త్రువుల‌ను చీల్చి చెండాడుతుంటే ఎలా ఉంటుందా అని అభిమానులు అప్పుడే తెగ ఊహించుకుంటున్నారు. ఈ సినిమా 2014 జ‌న‌వ‌రిలో వ‌చ్చే అవ‌కాశం ఉందంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: